Houses For Sale: అక్కడ ఇళ్లు కొనాలి అనుకున్నవారికి గుడ్ న్యూస్.. జస్ట్ 87 రూపాయలకే గోల్డెన్ ఛాన్స్

87 రూపాయలకే ఇళ్లు

ఇళ్లు కొనాలి అంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి.. బ్యాంక్ లోన్ తీసుకున్నా బయట అప్పు చేస్తే కానీ కొనే పరిస్థితి లేదు ఈ రోజుల్లో.. కానీ ఇలాంటి సమయంలో జస్ట్ 87రూపాయలకు ఇంటిని కొనుకున్నే అవకాశం ఉంది.. ఎక్కడో తెలుసా..?

  • Share this:
    Houses For sale: ఇంటిని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? ఎంత చౌక అంటే.. కేవలం 87 రూపాయలకే ఇళ్లు కొనుక్కోవచ్చు. అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. అది కూడా అత్యంత అందమైన నగరంలో.. నమ్మలేక పోతున్నారా.. కానీ ఇది నిజం.. అంత తక్కువ ఖరీదుకు ఎక్కడ ఇళ్లు దొరుకుతాయని సందేహ పడకండి.. ఇటలీలోని Bisaccia అనే అందమైన టౌన్ ఉంది. రోమ్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టౌన్‌లో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే.. అక్కడ 90 శాతం వరకు ఇళ్లు చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతో అందమైన ఈ నగరం ఇప్పుడు ఎవరు నివసించక బోసిపోయింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ టౌన్ ఇళ్లల్లో జనాభా నివాసముండేలా ప్రోత్సహించేందుకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఒకప్పటి నగరంలా అభివృద్ధి చేసేందుకే ఇలా విక్రయిస్తున్నామని పట్టణం డిప్యూటీ మేయర్ ఫ్రాన్సిస్కో టార్టాగ్లియా పేర్కొన్నారు.

    ఈ ఊరు ఒకప్పుడు ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. 1968లో వచ్చిన భూకంపం ప్రభావం ఈ ఊరిపై చాలా పడింది. ఆ తరువాత చాలా మంది ఇతర పట్టణాలకు తరలి వెళ్లారు. దాంతో ఊరంతా ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ ఊళ్లో అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఊరు జనంతో నిండిపోయేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకు వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే ఇండియన్‌ కరెన్సీలో 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటలోనూ పాల్గొనవచ్చు.

    టౌన్ అత్యంత పురాతనమైనది. ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదాని తర్వాత దగ్గరగా కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే ఉండేందుకు ఎంతో బాగుంటుందని ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తోంది. ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఇళ్లను వారే మరమ్మత్తులు చేయించుకోవాలి. కొత్త ఇళ్లల్లా తీర్చిదీద్దుకోవాలి. పునర్నిర్మాణం చేసుకోవాలి. పెట్టుబడి స్థాయిని బట్టి ఇళ్లన పునర్నిర్మించాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసినా ఇళ్లను పునరుద్ధరించాలి. ఒప్పందంలో డిపాజిట్ గ్యారెంటీగా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. పునరుద్ధరణ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

    అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని ఎలా ఉపయోగిస్తారో చేసి చూపించాలి. ఒకప్పుడు ఉన్ని తయారీదారులు, చేతివృత్తుల వారితో ఈ టౌన్ ఎంతో సందడిగా ఉండేది. మరీ ఈ ఆఫర్ ఎంతమందికి నచ్చుతుందో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: