Malaria Vaccine: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం WHO ఆమోదం

ప్రతీకాత్మకచిత్రం

Malaria Vaccine: కొన్ని శతాబ్దాలైనా..? మలేరియా ప్రజలను పట్టి పీడుస్తూనే ఉంది. ప్రతి ఏడాది వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది ఆ మహమ్మారి. అయితే ఇన్నాళ్లకు ఆ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. చిన్న పిల్లల కోసం ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్టు who ప్రకటించింది.

  • Share this:
    Malaria Vaccine: మలేరియా (Malaria) ఎప్పటినుంచో పట్టి పీడుస్తున్న మహమ్మారి.. అయితే ఇకపై దాని గురించి భయపడాల్సిన పరిస్థితి లేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. WHO దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేసింది. దోమల కారణంగా మలేరియా విస్తరిస్తోంది. ఈ రోగం బారిన పడి ప్రతి సంవత్సరం వందల మందిని చంపుతోంది. ప్రతి రెండు నిమిషాలకు ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నట్లు WHO ట్వీట్ చేసింది. అధిక మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి WTS RTS మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తోంది. 2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వారు తీవ్రంగా పని చేస్తున్నారు. 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా వ్యాక్సిన్‌ను ఉప-సహారా ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించింది. మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి సంవత్సరం దాదాపు 260,000 ఆఫ్రికన్ పిల్లలు మరణిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఇది చారిత్రాత్మక క్షణం అని ట్వీట్ చేశారు. మలేరియాను నివారించడానికి ఇప్పటికే ఉన్న పరికరాల పైన ఈ మలేరియా వ్యాక్సిన్‌ను ఉపయోగించడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది యువకుల ప్రాణాలను కాపాడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

    WHO ద్వారా ఉపయోగం కోసం ఆమోదించబడిన టీకా శాస్త్రీయ నామం RTS, S / AS01. WHO సంస్థ రెండు అతిపెద్ద సలహా సంస్థల ఆధారంగా సిఫార్సు చేసింది. 5 నెలల పైబడిన పిల్లలకు ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పిల్లలకు మొత్తం నాలుగు మోతాదులు ఉంటాయి. ఇప్పటివరకు, మూడు ఆఫ్రికన్ దేశాలలో 2.3 మిలియన్ డోసుల టీకా ఇచ్చారు. ఈ టీకా పూర్తిగా సురక్షితం అని నిరూపించారు.



    మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. దానికి వ్యాక్సిన్ కూడా సిద్ధమైందది. అయితే మన కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏమీ చెయ్యలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా.. ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారుచేసుకోలేకపోయాం.
    Published by:Nagesh Paina
    First published: