Publicity: ఛీ.. వ్యూస్‌ కోసం ఇంత దారుణమా..? ఓ తండ్రి పనిపై నెటిజన్ల మండిపాటు..? వైరల్ అవుతున్న వీడియో

వైరల్ వీడియో

Bad Father: సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫ్యామస్ అయిపోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. అప్పటికే కొంత ఫేమ్ రావడంతో.. మరింత దొందరగా గుర్తింపు పొందేందుకు వెనుక ముందు కూడా ఆలోచించరు.. తమకు వ్యూస్ రావాలని.. అంతా సూపర్ అంటూ కొనియాడాలని భ్రమ పడుతూ.. నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కు గురవుతారు.. తాజాగా ఓ తండ్రి చేసిన పని కూడా అలానే అయ్యింది.

  • Share this:
    Australia: ముఖ్యంగా సోషల్‌ మీడియా (Social Media)వినియోగం పెరిగాక మనం ఏం చేసినా వెంటనే నలుగురికి తెలిసిపోతుంది. మంచిపని అయితే మనం అడక్కుండానే ప్రశంసలు దక్కుతాయి. ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలు కూడా అదే విధంగా వస్తాయి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నెటిజనులు ఏ మాత్రం మోహమాటపడరు. వీర లెవ్వెల్లో తమ పర్ఫార్మెన్స్ తో విరామం లేకుండా ట్రోల్స్ చేస్తారు. తాజాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఓ వీడియో (Viral Video)పై నెటిజనులు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా.. అసలు మనిషివేనా అంటూ ఓ వ్యక్తిపై విరుకుపడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్‌ వ్రైట్‌ గత 20 సంవత్సరాలుగా మొసళ్ల వేటగాడి (Crockodail cacther)గా పని చేస్తున్నాడు. జనారణ్యంలోకి వచ్చిన మొసళ్లను గుర్తించి.. తిరిగి వాటి నివాస స్థలానికి తరలిస్తాడు. ఈ క్రమంలో మ్యాట్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఓ వీడియోని షేర్‌ (Video sharing) చేశాడు.

    ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది అనుకుంటున్నారా. దీనిలో రెండేళ్ల చిన్నారి ఒకడు తన రెండు చేతులతో ఓ పెద్ద పాము తోకను పట్టుకుని (Catch the snake) లాగుతుంటాడు. ఈ దృశ్యం చూస్తే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వీడియోలో ఉన్న చిన్నారి మ్యాట్‌ కుమారుడు. దీనిలో తన కుమారుడిని ఉద్దేశించి.. ‘‘దాన్ని బయటకు లాగు చిన్నా. దాన్ని పొదల్లోకి పంపు’’ అంటూ మ్యాట్‌ అరుస్తూ ఉంటాడు.

    ఇదీ చదవండి: ఈ జయ భరద్వాజ్ ఎవరు..? దీపక్ చాహార్ ప్రపోజ్ తో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

    ప్రస్తుతం ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు చిన్నారి సాహసాన్ని ప్రశంసిస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






    ‘‘ఛీ వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా.. ఆ పిల్లాడు చిన్నవాడు. పాము.. దాని నైజం గురించి వాడికి తెలియదు. కానీ నీ బుద్ధి ఏమైంది. పొరపాటున ఆ పాము నీ కొడుకును కాటేస్తే ఏంటి పరిస్థితి. అదేం బొమ్మ కాదు. వాడు లోకం తెలియని చిన్నారి.. అదేమో విచక్షణ లేని జీవి. ఎందుకు ఇలా నీ కుమారుడి జీవితంతో ఆడుకుంటున్నావ్‌.. పామును ఇలా హింసిచడం న్యాయమా’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. వీడియో పెట్టిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఆ తండ్రి చేసిన పనిపై ఫుల్ ట్రోల్స్ నడుస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: