హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russi Firing: క్యాంపస్ లో కాల్పులు.. కిటికీల్లోంచి దూకిన విద్యార్థులు.. ఆరుగురు మృతి

Russi Firing: క్యాంపస్ లో కాల్పులు.. కిటికీల్లోంచి దూకిన విద్యార్థులు.. ఆరుగురు మృతి

రష్యాలో కాల్పుల కలకలం

రష్యాలో కాల్పుల కలకలం

Russi firing: రష్యాలో వరుస కాల్పల ఘటనలు భయపెడుతున్నాయి. తాజాగా ఓ అగంతకుడి దాడిలో ఆరుగురు చనిపోగా.. 20 మందికిపైగా గాయపడ్డారు.. అయితే దుండగుడ్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Russian shooting: రష్యా (Russia)లోని పెర్మ్‌ నగరంలోని విశ్వవిద్యాలయం (University) కాల్పులతో దద్దరిల్లింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు  చనిపోగా (six killed in firing) మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టింది కూడా కాల్పులకు తెగబడింది వర్సిటీ విద్యార్థేనని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. ఘటనకు కారణాలను వెల్లడించలేదు. కాల్పుల చప్పుళ్లకు కొందరు విద్యార్థులు భయపడి భవనం రెండో అంతస్తులోని కిటికీల నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలు స్థానిక వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి. కాల్పుల సమాచారం అందుకున్న ఘటనా స్థలికి ముందుగా చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసు (Traffic Polices) లపైకి దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడని, నిరాయుధుడిని చేసి అదుపులోకి తీసుకున్నట్లు అంతరంగిక శాఖ వెల్లడించింది. పెర్మ్‌ యూనివర్సిటీలో మొత్తం 12వేల మంది చదువుకుంటుండగా ఘటన సమయంలో సుమారు 3వేల మంది ఉన్నట్లు అంచనా. వర్సిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది రష్యాలోని విద్యా సంస్థలో జరిగిన రెండో ఉదంతం ఇది. తాజా ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్టు రష్యన్ ఇన్వెస్టిగేషన్ కమిటీ తెలిపింది. తొలుత ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సాధారణంగా విద్యా సంస్థల్లో కఠినమైన భద్రత చర్యలు, తుపాకుల కొనుగోలులో చట్టబద్ధత వల్ల రష్యాలోని పాఠశాల ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.

ఇదీ చదవండి: ఈ నెల 24వ తేదీన మోదీ-బైడెన్ భేటీ.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఇవే..

తాజా ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడికి కాల్పులకు దొరక్కుండా తప్పించుకోడానికి ముందు విద్యార్థులు క్యాంపస్‌లోని భవనాల కిటికీల నుంచి దూకి పరుగెత్తడం వీడియోలు కనబడుతోంది.

ఇదీ చదవండి: జెట్ వేగంతో దూసుకొస్తున్న మహమ్మారి.. ఎయిర్ బార్న్ డిసీజ్ గా మారే ప్రమాదం

నల్లటి దుస్తులు ధరించిన నిందితుడు, తలకు హెల్మెట్ పెట్టుకుని తుపాకి పట్టుకుని క్యాంపస్‌లోకి నడుచుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మేలో కజాన్ నగరంలో ఓ 19 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. ఈ ఘటనను రష్యా చరిత్రssiలోనే అత్యంత హేయమైన చర్యగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నవంబరు 2019లోనూ ఓ విద్యార్ధి సహచరులపై జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. అనంతరం తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

First published:

Tags: Crime news, International news, Russia, World news

ఉత్తమ కథలు