అంతర్జాతీయ పత్రికలో ప్రణయ్-అమృత విషాదగాథ...వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రత్యేక కథనం...

ప్రణయ్ హత్య తర్వాత మిర్యాలగూడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన భిన్నవాతావరణాన్ని కథనంలో పేర్కొంది. ప్రణయ్ హంతకులకు మద్దతుగా, వ్యతిరేకంగా ఏర్పడిన సమూహాలపై కూడా కథనం ప్రత్యేక దృష్టిని సారించింది.

news18-telugu
Updated: August 20, 2019, 4:37 PM IST
అంతర్జాతీయ పత్రికలో ప్రణయ్-అమృత విషాదగాథ...వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రత్యేక కథనం...
ప్రణయ్, అమృత (ఫైల్ చిత్రం)
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకున్న ప్రణయ్, అమృత విషాదం అంతర్జాతీయ సమాజాన్ని కదిలించింది. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రణయ్ హత్యోదంతంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దళితుడైన ప్రణయ్‌తో అమృత వివాహం చేసుకుందనే కక్షతో ఆమె తండ్రి మారుతీరావు అతి దారుణంగా హత్య చేయించడం, అనంతరం సమాజంలో పరువు హత్యలపై చోటుచేసుకున్న భిన్నవాదనల నేపథ్యాన్ని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా కులం పేరుతో భారత్‌లో నేటికి పరువు హత్యలు జరుగుతున్నాయని ప్రణయ్ ఉదంతం ద్వారా పేర్కొంది. అంతే కాదు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కులం పేరిట సంకుచిత భావంతో ఇలాంటి ఘటనలు చేసుకోవడం దురదృష్టకరమని తెలిపింది.  అలాగే ప్రణయ్ హంతకులు బెయిల్ పై విడుదలవడాన్ని సైతం పత్రిక ప్రముఖంగా పేర్కొంది.

అంతేకాదు 2017 సంవత్సరం దేశంలోని వివాహాలపై జరిపిన ఓ సర్వేలో కేవలం 5.8 శాతం కులాంతర వివాహాలు మాత్రమే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ప్రణయ్ హత్య తర్వాత మిర్యాలగూడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన భిన్నవాతావరణాన్ని కథనంలో పేర్కొంది. ప్రణయ్ హంతకులకు మద్దతుగా, వ్యతిరేకంగా ఏర్పడిన సమూహాలపై కూడా కథనం ప్రత్యేక దృష్టిని సారించింది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...