• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • INTERNATIONAL ANTI CORRUPTION DAY 2020 WHY WE CELEBRATE INTERNATIONAL ANTI CORRUPTION DAY WHAT IS THE SIGNIFICANCE WHAT IS THE THEME THIS YEAR NK

International Anti-Corruption Day 2020: నేడు అవినీతి వ్యతిరేక దినం.. ఇదీ చరిత్ర

International Anti-Corruption Day 2020: నేడు అవినీతి వ్యతిరేక దినం.. ఇదీ చరిత్ర

International Anti-Corruption Day 2020: నేడు అవినీతి వ్యతిరేక దినం.. (credit - twitter - Shaikh Petroleum)

International Anti-Corruption Day 2020: అవినీతి వ్యతిరేక దినం ఎందుకు జరుపుతున్నారు? ఇది ఎలా మొదలైంది? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? తెలుసుకుందాం.

  • Share this:
    International Anti-Corruption Day 2020: డబ్బంటే ఎవరికి చేదు... ఈ వీక్ పాయింటే అవినీతికి దారి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి లేని దేశాలు చాలా తక్కువ. ఈ అవినీతిపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు... ఓ రోజును కేటాయింటారు. అదే ఈ రోజు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం నేడు. ఈ రోజున అన్ని దేశాలూ... అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాయి. అలాగే... విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్రతి ఒక్కరూ అవినీతిపై పోరాటంలో భాగస్వామ్యం కావాలని దేశాలు పిలుపు ఇస్తాయి. ఇందుకోసం ఎవరు ఎలా కృషి చేయాలో కూడా చెబుతారు. 2003 డిసెంబర్ 31న ఈ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం ప్రారంభమైంది. ఆ రోజున ఐక్యరాజ్య సమితి సాధారణ సభ... అవినీతికి వ్యతిరేకంగా ఓ కాన్వకేషన్ (UN Convention) నిర్వహించింది. ఆ తర్వాత ఐక్రాజ్యసమితిలో డ్రగ్స్ అండ్ క్రైమ్‌పై (UNODC) ఓ సచివాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత డిసెంబర్ 9ని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా ఐరాస సాధారణ సదస్సు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఏటా ఈ రోజున మనం అవినీతిపై పోరాటాన్ని గుర్తుచేసుకుంటున్నాం.


    International Anti-Corruption Day 2020 Theme:
    ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే... కలసికట్టుగా మనం అవినీతిపై పోరాడుదాం అనేది నిర్ణయించారు. ఎందుకంటే... ఓ దేశమైనా, ఓ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాలంటే... కరప్షన్ అన్నది ఉండకూడదు. అది ఉన్న దేశాల్లో అభివృద్ధి ఉండదు. అక్కడకు పెట్టుబడులు రావు. కొత్త కంపెనీలు రావు. ఉద్యోగాలు ఉండవు. అన్నీ నష్టాలే. కొంత మంది తమ పనులను పూర్తి చేయించుకోవడానికి ఇలా అవినీతిని ప్రోత్సహిస్తారు. డబ్బుతో ప్రభుత్వ ఉద్యోగులను తమ దారికి తెచ్చుకుంటారు. ఈ అడ్డదారుల వల్ల అన్నీ నష్టాలే. ఆ ఉద్యోగులు కూడా ఏదో ఒక రోజున ఏసీబీకి చిక్కి సస్పెండ్ అవుతారు. అడ్డగోలు సంపాదనంతా ఏసీబీ స్వాధీనం చేసుకుంటుంది. అందువల్ల అవనీతిని ప్రోత్సహించకూడదు. అవనీతి బాటలో వెళ్లకూడదు.




    మనం కరోనా వచ్చిందని ఏడాదిగా విలవిలలాడుతున్నాం. కానీ... దశాబ్దాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అసలు వైరస్ అవినీతి అని గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే అది మనకు డైరెక్టుగా కనిపించదు. కానీ మన జీవితాలపై దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆ అవినీతే లేకపోతే... మన దేశం ఇంకా చాలా డెవలప్ అయ్యేదే అంటున్నారు ఆర్థిక నిపుణులు. అవనీతి అంటే... లంచాలు మాత్రమే కాదు. ఓటుకు నోటు తీసుకుంటే కూడా అవినీతే. ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ ప్రజలదే. ఆ ఖర్చుల లెక్కలు ప్రజలకు చూపించకపోవడం కూడా అవినీతితో సమానమే. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ప్రభుత్వాలు... తమకు వస్తున్న ఆదాయం, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నదీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా చూపించవచ్చు. కానీ... వాస్తవంలో అలా జరగట్లేదు. ఏ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారానో అప్లికేషన్ పెట్టుకుంటే... అప్పుడు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

    ఇది కూడా చదవండి:Gang Rape and Murder: గుజరాత్‌లో దారుణం... 10 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

    అవినీతి వల్ల అన్నీ నష్టాలే కాబట్టి... దాన్ని ఏ దశలోనూ ప్రోత్సహించవద్దని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పోరాడాలని సూచిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: