Joe Biden- Anjali Bhardwaj: భారతీయ మహిళకు అరుదైన గౌరవం.. అమెరికాకు పిలిచిమరీ సత్కరించనున్న బైడెన్ సర్కారు

అంజలీ భరద్వాజ్ (Photo courtesy: Amarjeet Kumar Singh Twitter )

భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఆమె సేవలను గుర్తించిన అమెరికా సర్కారు ప్రత్యేక అవార్డుతో సత్కరించనుంది. ఆమెతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 11 మందికి కూడా అవార్డులను అందివ్వనుంది..

  • Share this:
    భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఆమె సేవలను గుర్తించిన అమెరికా సర్కారు ప్రత్యేక అవార్డుతో సత్కరించనుంది. ఆమెతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 11 మందికి కూడా అవార్డులను అందివ్వనుంది. ఈ మేరకు మంగళవారం అమెరికా సర్కారు ఓ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అవినీతి నిరోధానికి కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 12 మంది అవినీతి నిరోధక ఉద్యమకారులు, సామాజిక సేవాకారుల జాబితాను అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన అంజలీ భరద్వాజ్ స్థానం దక్కించుకున్నారు. 48 ఏళ్ల సామాజిక ఉద్యమకారిణి అయిన ఆమె, గత రెండు దశాద్దాలుగా వివిధ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు.

    ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతను పెంపొందించడం, అదే సమయంలో ప్రభుత్వాలు జవాబుదారీతనంతో కలిగి ఉండేందుకు అంజలీ భరద్వాజ్ కృషి చేస్తున్నారు. దీనికోసం సతర్క్ నగ్రీక్ సంఘటన్ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా అందుకున్నారు. ఆమె చేసిన కృషిని బైడెన్ సర్కారు గుర్తించింది. ఆమెతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 11 మందికి యాంటీ కరప్షన్ ఛాంపియన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. అవినీతి అక్రమాలను నిర్మూలించేందుకు, ప్రభుత్వంలో జవాబుదారీ తనాన్ని కల్గించేందుకు అవిశ్రాంతం కృషి చేస్తున్న వారందరినీ మేం సత్కరించబోతున్నాం అంటూ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


    ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే వింత కేసు.. భర్త పనిచేసే కంపెనీపై కేసు పెట్టిన భార్య.. మాకు కరోనా రావడానికి మీరే కారణమంటూ..

    అంజలీ భరద్వాజ్ తోపాటు , అల్బేనియాకు చెందిన ఆర్డియన్ ద్వోరణి, ఈక్వేడర్ కు చెందిన దైనా సలాజర్, మైక్రోనేసియాకు చెందిన సోఫియా ప్రేత్రిక్, గౌటేమలకు చెందిన జువాన్ ఫ్రాన్సిస్కో శాండోవల అల్ఫారో, జీనియాకు చెందిన కలీల్ గ్యూయే, ఇరాక్ కు చెందిన ధుహా ఏ మహ్మద్, కైర్గాజ్ రిపబ్లిక్ కు చెందిన బోలోట్ టెమిరావ్, లిబియాకు చెందిన ముస్తాఫా అబ్దుల్లా సనల్లా, ఫిలిప్పీన్ కు చెందిన విక్టోర్ సోట్టో, సైర్రా లీయోన్ కు చెందిన ఫ్రాన్సిస్ బెన్ కైఫలా, ఉక్రెయిన్ కు చెందిన రస్లాన్ రయాబోషప్కాకు బైడెన్ సర్కారు ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. త్వరలోనే వీరందరికీ అమెరికాలో అవార్డులను ఇచ్చి సత్కరించున్నారు.
    ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..
    Published by:Hasaan Kandula
    First published: