సర్జరీతో సిక్స్ ప్యాక్...జిమ్‌కు వెళ్లే బాధలేకుండానే రెడీమేడ్ కండలు.. ఎక్కడో తెలుసా ?

బ్యాంకాక్ లో మాస్టర్ పీస్ ఇంటర్నేషనల్ అనే ఆసుపత్రి మాత్రం సిక్స్ ప్యాక్ కోసం ఎలాంటి ఎక్సర్‌సైజులు అవసరం లేదని, కాస్మోటిక్ సర్జరీతో కడుపు మీద ఇన్ స్టంట్ సిక్స్ ప్యాక్ రెడీ చేస్తామని ఆఫర్ ఇస్తోంది.

news18-telugu
Updated: April 30, 2019, 8:16 PM IST
సర్జరీతో సిక్స్ ప్యాక్...జిమ్‌కు వెళ్లే బాధలేకుండానే రెడీమేడ్ కండలు.. ఎక్కడో తెలుసా ?
ఫైల్ చిత్రం
  • Share this:
సిక్స్ ప్యాక్ కావాలంటే ఎవరైనా జిమ్ లో ఒళ్లు హూణం అయ్యేలా వర్కౌట్ చేస్తారు. సినిమా హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ట్రైనర్లను పెట్టుకొని మరీ కసరత్తులు చేసి అభిమానులను మెప్పిస్తుంటారు. ఫిట్ నెస్ ట్రైనర్లు సైతం సిక్స్ ప్యాక్ అంటే అంత ఈజీ కాదని కడుపు మీద కండలు రావాలంటే చెమటలు కక్కాల్సిందేనని చెబుతుంటారు. అయితే బ్యాంకాక్ లో మాస్టర్ పీస్ ఇంటర్నేషనల్ అనే ఆసుపత్రి మాత్రం సిక్స్ ప్యాక్ కోసం ఎలాంటి ఎక్సర్‌సైజులు అవసరం లేదని, కాస్మోటిక్ సర్జరీతో కడుపు మీద ఇన్ స్టంట్ సిక్స్ ప్యాక్ రెడీ చేస్తామని ఆఫర్ ఇస్తోంది. పాంగ్ ‌పపర్న్ అనే యువకుడి మీద తొలిసారి ఈ సిక్స్ ప్యాక్ సర్జరీ ట్రై చేయగా సక్సెస్ అయ్యింది. ఆరు పలకల దేహం బయటపడింది. మాస్టర్ పీస్ హాస్పిటల్ సీఈవో, రవీవత్ మాట్లాడుతూ... సిక్స్ ప్యాక్ సర్జరీ సక్సెస్ అయినప్పటి నుంచి తమ ఆసుపత్రికి వచ్చే వారిలో 90 శాతం మంది సిక్స్ ప్యాక్ సర్జరీ కోసమే వస్తున్నారని అన్నారు. పొట్ట భాగంలో అనవసరమైన కొవ్వును లైపోసక్షన్ ద్వారా తొలగించి. ఆతర్వాత తాము అందించే స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకుంటే సిక్స్ ప్యాక్ రెడ్డీ అంటున్నారు.

ఇదిలా ఉంటే అటు అమ్మాయిలకు సైతం జీరో సైజు నడుములు, సొగసైన పిరుదులు, ఎత్తైన వక్షోజాల సర్జరీలు కూడా చేస్తామని మాస్టర్ పీస్ ఆసుపత్రి ఆఫర్ లు ఇస్తోంది.

 

Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook


Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook


Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook


Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Pangpaparn Ounvilai / Facebook


Photo: Masterpiece Hospital/ Facebook
Photo: Masterpiece Hospital/ Facebook
First published: April 30, 2019, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading