ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి బ్రిటన్ కేబినెట్‌లో చోటు

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి బ్రిటన్ కేబినెట్‌లో చోటు

బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు ట్రెజరీ చీఫ్‌ సెక్రెటరీ పదవి దక్కింది. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

 • Share this:
  భారత సంతతికి చెందిన ప్రముఖులు ఇతర దేశాల్లోని ప్రభుత్వాల్లో కీలక పదవుల్ని అలంకరిస్తున్నారు. బ్రిటన్ కొత్త ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ముగ్గురు ప్రముఖులు ఉండటం విశేషం. వారిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునక్‌ కూడా ఉన్నారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా కన్జర్వేటీవ్ పార్టీ సీనియర్ నేత బోరిస్ జాన్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేబినెట్ కూర్పు చేశారు. బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు ట్రెజరీ చీఫ్‌ సెక్రెటరీ పదవి దక్కింది. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.


  రిషి సునక్ వయస్సు 39 ఏళ్లు. ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. తన క్లాస్‌మేట్ అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2014లో రిషి సునక్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్ ఎంపీగా గెలిచారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రిషి సునక్‌ను ఇప్పుడు చీఫ్ సెక్రెటరీ ఆఫ్ ట్రెజరీ పదవి వరించింది. రిషీ సునక్‌తో పాటు భారత సంతతికి చెందిన మరో ఇద్దరికి బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో చోటు దక్కింది. హోమ్ సెక్రెటరీగా ప్రీతి పాటిల్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెక్రెటరీగా అలోక్ శర్మకు పదవులు వరించాయి.

  Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


  ఇవి కూడా చదవండి:

  Scholarship: 550 మంది పేద విద్యార్థులకు మహీంద్రా ట్రస్ట్ స్కాలర్‌షిప్

  Business: టమాటా సాస్ బిజినెస్‌తో నెలకు రూ.40,000 ఆదాయం

  Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ...
  First published: