హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Infosys : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ఇన్ఫోసిస్ కు కొత్త చిక్కులు!

Infosys : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ఇన్ఫోసిస్ కు కొత్త చిక్కులు!

Rishi Sunak : భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రష్యాలో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికాతో పాటుగా యూరప్‌ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్‌ ఉనికిపై ప్రముఖ బ్రిటన్‌ వార్త సంస్థ రిషి సునక్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా బ్రిటిష్ టీవీ చానెల్ స్కై న్యూస్ ఇంట‌ర్వ్యూలో రిషి సునాక్ పాల్గొనగా...ఇత‌ర సంస్థ‌లు ర‌ష్యాతో సంబంధాలు తెంచుకుంటే ఇన్ఫోసిస్ ఎందుకు లావాదేవీలు నిర్వ‌హిస్తున్న‌ద‌ని సునాక్ రిషిని స్కై న్యూస్ చానెల్ యాంక‌ర్ ప్ర‌శ్నించారు.

ఇంకా చదవండి ...

Infosys Caught In Russia-Ukraine Crossfire  : ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్‌ పై దండ‌యాత్ర‌కు దిగిన ర‌ష్యాపై అమెరికా.. దాని మిత్ర దేశాలు ఆంక్ష‌లు విధించాయి. ప‌లు విదేశీ సంస్థ‌లు ర‌ష్యాతో సంబంధాలు తెగ‌దెంపులు చేసుకున్నాయి. అయితే యుద్ద ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. కాగా ఇప్పుడు ఇదే యుద్దం ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, భార‌త సంత‌తికి చెందిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది.

.యూకే ఛాన్స్‌లర్‌ ఆఫ్‌ ఎక్స్‌చెకర్‌, ఫైనాన్స్‌ మినిష్టర్‌గా రిషి సునక్‌ వ్యవహారిస్తున్నారు. రిషి సునక్‌ స‌తీమ‌ణి స్వ‌యాన ఇన్ఫోసిస్ స‌హావ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి త‌న‌య అక్షత మూర్తి. ఆమెకు ఇన్ఫోసిస్ కంపెనీలో షేర్లు కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌లో దాని స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి కూతురు అక్ష‌త మూర్తికి 100 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల షేర్లు ఉన్నాయి.భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రష్యాలో కూడా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికాతో పాటుగా యూరప్‌ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలోని ఇన్ఫోసిస్‌ ఉనికిపై ప్రముఖ బ్రిటన్‌ వార్త సంస్థ రిషి సునక్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా బ్రిటిష్ టీవీ చానెల్ స్కై న్యూస్ ఇంట‌ర్వ్యూలో రిషి సునాక్ పాల్గొనగా...ఇత‌ర సంస్థ‌లు ర‌ష్యాతో సంబంధాలు తెంచుకుంటే ఇన్ఫోసిస్ ఎందుకు లావాదేవీలు నిర్వ‌హిస్తున్న‌ద‌ని సునాక్ రిషిని స్కై న్యూస్ చానెల్ యాంక‌ర్ ప్ర‌శ్నించారు. యూకే ఆర్థిక మంత్రి ఇంట్లోని వారు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ సదరు వార్త పత్రిక సునక్‌ను ఇంటర్వూలో అడిగారు. బ్రిట‌న్ స‌ర్కార్ విధించిన ఆంక్ష‌లు మీకు వ‌ర్తించ‌వా? అని నిల‌దీసినంత ప‌ని చేశారు.

ALSO READ Lord Shiva : భూ కబ్జా కేసులో విచారణకు హాజరైన 'శివుడు'!

దీనిపై స్పందించ‌డానికి సునాక్ రిషి తడ‌బ‌డ్డారు. తానేమీ ఇన్ఫోసిస్‌లో భాగం కాద‌ని చెప్పుకొచ్చారు. ఇన్ఫోసిస్‌లో వాటాలు ఉన్నా, త‌న భార్య అక్ష‌త మూర్తి స్వ‌తంత్రురాల‌ని, బ్రిట‌న్ ఎంపీ కాద‌ని సునాక్ వివ‌ర‌ణ ఇచ్చారు. బ్రిట‌న్ ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధిగా మాట్లాడేందుకు తాను వ‌చ్చాన‌ని తెలిపారు. బ్రిట‌న్ ప్ర‌ధానిగా బోరిస్ జాన్స‌న్‌కు తాను వార‌సుడిన‌న్నారు. సునాక్ భార్య అక్ష‌త ఎంపీ కాకున్నా.. ఉక్రెయిన్‌కు బ్రిట‌న్ సాయం చేస్తున్న వేళ‌.. ర‌ష్యా నుంచి ఆయ‌న కుటుంబం లాభాలు పొంద‌డం స‌రైన‌దేనా అని న్యూస్ చానెల్ ప్ర‌శ్నించింది. కానీ కంపెనీల లావాదేవీలు వాటి యాజ‌మాన్యాల‌పై ఆధార‌ప‌డి ఉంటాయ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌లు అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కంపెనీల‌దేన‌న్నారు. ఇన్ఫోసిస్ విష‌యంలో తాను చేసేదేమీ లేద‌న్నారు. ఇన్ఫోసిస్ వ్యాపార‌ లావాదేవీల‌కు తాను బాధ్య‌త వ‌హించ‌లేన‌న్నారు రిషి సునాక్‌. కాగా ,ర‌ష్యాలో సేవ‌ల‌పై ఇన్ఫోసిస్ స్పందించింది. అక్క‌డ చిన్న టీం మాత్ర‌మే ప‌ని చేస్తున్న‌ద‌ని గ్లోబ‌ల్ క్ల‌యింట్లకు సేవ‌లు అందిస్తున్న‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చింది. ఉక్రెయిన్ బాధితుల కోసం 10 కోట్ల డాల‌ర్ల స‌హాయ నిధి ప్ర‌క‌టించామ‌ని పేర్కొంది. ర‌ష్యా స్థానిక సంస్థ‌ల‌తో ఎటువంటి బిజినెస్ సంబంధాల్లేవ‌ని వ్యాఖ్యానించింది. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో తాము శాంతికి మద్దతు ఇస్తామని ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

First published:

Tags: Britain, Infosys, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు