• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • INFLATION HITS PAKISTAN ESSENTIAL COMMODITIES PRICE HIKE ONE EGG FOR RS 30 KG GINGER RS 1000 SK

ఒక్క గుడ్డు రూ.30.. కిలో అల్లం రూ.1000.. ధరల మోతతో అల్లాడుతున్న జనం

ఒక్క గుడ్డు రూ.30.. కిలో అల్లం రూ.1000.. ధరల మోతతో అల్లాడుతున్న జనం

ప్రతీకాత్మక చిత్రం

నిత్యావసర సరుకులల ధరలు షాకిస్తున్నాయి. ఓ బ్యాగ్ నిండా కూరగాయలు కావాలంటే.. అదే బ్యాగ్ నిండా డబ్బుు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

  • Share this:
    మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ రేట్లు రూ.100కి చేరితే.. ఎల్పీజీ ధర ఏకంగా రూ.వెయ్యికి చేరువవుతోంది. కూరగాయలు, పండ్ల ధరలు మాత్రం అదుపులోనే ఉన్నాయి. కానీ పక్కదేశం పాకిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నాయి. పాకిస్తాన్‌లో ద్రవ్యోల్పణం తారా స్థాయికి చేరింది. డబ్బుకు విలువ లేకుండా పోతోంది. ప్రభుత్వ ఆదాయాం పెంచడమే లక్ష్యంగా పన్నుల మోత మోగిస్తోంది. అందుకే అక్కడ నిత్యావసర సరుకులల ధరలు షాకిస్తున్నాయి. ఓ బ్యాగ్ నిండా కూరగాయలు కావాలంటే.. అదే బ్యాగ్ నిండా డబ్బుు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

    పాకిస్తాన్‌లో ఒక్క గుడ్డు ధర రూ.30కి చేరింది. అదే మన దేశంలో రూ.5కే వస్తుంది. రావల్పిండిలో డజన్ గుడ్ల ధర రూ.350 పలుకుతోంది. ఇక కిలో అల్లం ధర పాకిస్తాన్‌లో ఏకంగా రూ.1000కి చేరినట్లు తెలుస్తోంది. అదే అల్లం మన దేశంలో రూ.50కి వస్తుంది. గత డిసెంబరు నుంచి ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుడ్డు, అల్లమే కాదు.. చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరాచీలో లైవ్ చికెన్ ధర కిలోకు రూ. 370, రూ. బీఫ్ 450, మటన్ రూ.900లకు చేరింది.

    అంతేకాదు పశుగ్రాసం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కూడా వేధిస్తోంది. పాకిస్తాన్ ఎప్పుడూ లేనంత తీవ్రమైన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఐతే చక్కెర ధరలు మాత్రం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కిలో చక్కెర రూ.100కు పైగా ఉండేది. కానీ ఇటీవలే తగ్గింది. ప్రస్తుతం రూ.80 పలుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన చర్యల వల్లే చక్కెర ధరలు దిగొచ్చాయని పీటీఐ నేతలు పేర్కొంటున్నారు. ఐతే ఒక్క చక్కెర రేటు తగ్గితే సరిపోతుందా.. మిగిలిన అన్ని వస్తువులు ధరలు మండిపోతున్నాయని అక్కడి జనం మండిపడుతున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు