Home /News /international /

Indonesia Volcano: ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. 13 మంది మృతి.. భీకర దృశ్యాలు

Indonesia Volcano: ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. 13 మంది మృతి.. భీకర దృశ్యాలు

ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం

ఇండోనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం

Indonesia Volcano: ఇండోనేసియా ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది. అందుకే అక్కడ తరచూ భూకంపాలు, సునామీలు వస్తాయి. అగ్నిపర్వతాలు బద్ధలవుతాయి. మౌంట్ సెమేరు ఈ ఏడాది జనవరిలో కూడా బద్ధలయింది. కానీ అప్పుడు ఈ స్థాయిలో విరుచుపడలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇంకా చదవండి ...
    ఇండోనేసియా (Indonesia)లో ప్రకృతి విలయతాండవం చేసింది. తూర్పు జావా ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత అగ్నిపర్వతం సెమేరు (Mount Semeru Volcano) బద్ధలయింది.  పెద్ద ఎత్తున బూడిద ఎగజిమ్మింది. లావా ఉప్పొంగి ప్రవహించి... చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను తుడిచిపెట్టేసింది. ఊళ్లకు ఊళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు, పొలాలు.. ఇలా ఎక్కడ చూసినా బూడిద కనిపిస్తోంది. అగ్నిపర్వతం బద్ధలవడంతో భరించలేనంత వేడి వస్తోంది. వేడి గాలులను తట్టుకోలేక..బూడిదతో ఊపిరాడక.. ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. వారిలో గర్భిణులతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అగ్నిపర్వతం నుంచి లావా ఇంకా ఎగిసిపడుతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణాలరచేత పట్టుకొని పారిపోతున్నారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

    Viral News: ఇంట్లోకి పాము వచ్చిందని భయంతో కర్ర విసిరాడు.. అంతే రూ. ఏడున్నర కోట్లు మటాష్

    అంతేకాదు అగ్నిపర్వతం సమీపంలో ఉన్న నదుల్లో బురద ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున బూడిద చేరడంతో నదులు, కాల్వలు బురదమయం అయ్యాయి. అవి గ్రామాలను ముంచెత్తడంతో ఇళ్లు, వాహనాలు బురదలో కూరుకుపోయాయి. అగ్నిపర్వతం ధాటికి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. పలు గ్రామాల్లో ఇండోనేసియా ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. తప్పిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిపర్వతం బద్ధలవుతున్న దృశ్యాలతో పాటు జనం పారిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.











    ఇండోనేసియా ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది. అందుకే అక్కడ తరచూ భూకంపాలు, సునామీలు వస్తాయి. అగ్నిపర్వతాలు బద్ధలవుతాయి. మౌంట్ సెమేరు ఈ ఏడాది జనవరిలో కూడా బద్ధలయింది. కానీ అప్పుడు ఈ స్థాయిలో విరుచుపడలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indonesia, Volcano

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు