హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పెళ్లికి మందు శృంగారం నేరం..వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు!

పెళ్లికి మందు శృంగారం నేరం..వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Premarital affair punishable :పెళ్లికి మందు శృంగారంలో పాల్గొనడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. మారుతున్న లైఫ్ స్టైల్, సమాజంలో మార్పుల కారణంగా ఈ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Premarital affair punishable :పెళ్లికి మందు శృంగారంలో పాల్గొనడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. మారుతున్న లైఫ్ స్టైల్, సమాజంలో మార్పుల కారణంగా ఈ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. సమాజంలోని పలు సంస్కృతుల్లో చాలా మందికి పెళ్లికి ముందే శృంగారం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పెళ్లికి ముందు శృంగారం.. తమకు కాబోయే భార్య లేదా భర్తను మోసం చేయడమే అవుతుందని చాలామంది భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలు చేయకుండా ఉండటంతో పాటు, తమ దేశ విలువలు పెంచడం కోసం ఇండోనేషియా(Indonesia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీుకుంది. ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. వీటికి సంబంధించిన క్రిమినల్‌ కోడ్‌ ముసాయిదా ను ఈ నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ క్రిమినల్‌ కోడ్‌ ముసాయిదా ప్రకారం.. తమ భర్త లేదా భార్య కాని వారితో ఎవరైనా సంభోగం చేస్తే వ్యభిచారం కింద పరిగణించి.. వారికి గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా గరిష్ట జరిమానాతో శిక్షించబడతారు. వ్యభిచారానికి పాల్పడినవారిపై భర్త లేదా భార్య లేదా వారి పిల్లల నుండి ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభంకాకముందే తమ ఫిర్యాదులను ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు. అయితే ఈ విధానాన్ని గతంలోనే తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు. దీంతో ప్రభుత్వం అప్పుడు వెనక్కు తగ్గింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది.

Time Traveller : టైమ్ ట్రావెలర్ సందేశం.. మూడో ప్రపంచ యుద్ధ ఫొటోలు రిలీజ్!

ఇండోనేషియా విలువలను కాపాడేందుకు క్రిమినల్ కోడ్‌ను తీసుకొస్తున్నందుకు మేం గర్విస్తున్నాం అని ఇండోనేషియా డిప్యూటీ న్యాయ మంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారీజ్ అన్నారు. ఈ రూల్ ఇండోనేషియా పౌరులతో పాటు దేశంలోని విదేశీయులకు సమానంగా వర్తిస్తుందని ఆయన అన్నారు. కాగా.. కొత్త నిబంధనలు పర్యాటక మరియు పెట్టుబడలపై ప్రభావం చూపవచ్చని వ్యాపార వర్గాలు తమ ఆందోళనలను లేవనెత్తాయి.

కాగా.. ఇండోనేషియా అతిపెద్ద ముస్లిం దేశం, అయితే ఇది షరియా చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయని ఉదారవాద దేశంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు అది మారుతోంది. ఈ కొత్త చట్టం దేశంలో సంప్రదాయవాద ముస్లింల యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుంది. వివాహానికి ముందు సెక్స్‌ను నిషేధించే ఈ కొత్త చట్టానికి ఇస్లామిస్ట్ గ్రూపులు మద్దతు ఇస్తున్నాయి. ఇక,ఈ దేశంలో మహిళలు, మతపరమైన మైనారిటీలు, LGBT వ్యక్తుల పట్ల వివక్ష చూపే వందలాది స్థానిక చట్టాలు ఉన్నాయి. మహిళలు, స్వలింగ సంపర్కులపై ఇప్పటికే ఈ దేశం ఎన్నో ఆంక్షలు విధించింది

First published:

Tags: Indonesia

ఉత్తమ కథలు