నౌకల నిండా చెత్త... వెనక్కి పంపుతున్న ఇండోనేసియా...

Indonesia : ఇప్పటికే ఇండొనేసియా ప్రభుత్వం చెత్తతో ఉన్న 250 కంటైనర్లను సీజ్ చేసింది. వాటిని వెనక్కి పంపేసింది. మరో 1000 కంటైనర్లను పరిశీలిస్తున్నారు అధికారులు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 9:49 AM IST
నౌకల నిండా చెత్త... వెనక్కి పంపుతున్న ఇండోనేసియా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 9:49 AM IST
మన వీధుల్లో జనరల్‌గా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎదురింటి దగ్గర చెత్తంతా పోగేసి... పక్కింటి దగ్గర పోస్తుంటారు. పక్కింటి వాళ్లు... తిరిగి ఎదురింటి దగ్గరే పోస్తారు. ఇదే సీన్ ప్రపంచ దేశాల మధ్య కనిపిస్తోంది. ఎక్కువైపోతున్న చెత్తను ఎక్కడ పారేయాలో తెలీక... కంటైనర్లలో నింపి... నౌకల్లో ఇతర దేశాలకు తరలించి... అక్కడ వదిలించుకుంటున్నారు. తమ దగ్గర ఇలాంటి ఆటలు సాగవంటున్న ఇండొనేసియా... చెత్తతో ఉన్న కంటైనర్లను... ఏ దేశం నుంచీ వచ్చాయో అదే దేశానికి తిరిగి పంపిస్తోంది. సమస్యేంటంటే... చాలా విదేశాలు... ఇండొనేసియాకి చెత్తను తరలించి... అక్కడ ఎంతో కొంత రేటుకు అమ్ముకుంటున్నాయి. అక్కడి చెత్త కంపెనీలు... ఆ చెత్తను కొనుక్కోని రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఐతే... ఆ రీసైక్లింగ్ ప్రక్రియలో చాలా చెత్త రీసైక్లింగ్‌కి పనికిరాకుండా పోతోంది. అదంతా ఇండొనేసియాలో పోగవుతోంది.

ఇప్పటికే ఇండొనేసియా ప్రభుత్వం చెత్తతో ఉన్న 250 కంటైనర్లను సీజ్ చేసింది. వాటిని వెనక్కి పంపేసింది. 250 కంటైనర్లలో 49... ఫ్రాన్స్, హాంకాంగ్, ఆస్ట్రేలియాకి చెందినవని తెలిసింది. ఇండొనేసియాలోని రెండో పెద్ద నగరం... సురబయ నుంచీ... అమెరికా, బ్రిటన్, జర్మనీ‌కి 200 కంటైనర్ల చెత్తను వెనక్కి పంపారు. వాటిలో చెత్త, ప్లాస్ట్ వేస్ట్, ప్రమాదకరమైన వస్తువులు ఉన్నట్లు తెలిసింది. మరో 1000 కంటైనర్లను పరిశీలిస్తున్నారు అధికారులు. విదేశీ దిగుమతుల నిబంధనల ప్రకారం అలాంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం ఇండోనేసియాలో నిషేధం. విషపూరిత పదార్థాలు ఉంటే... దిగుమతి చేయడానికి వీల్లేదని అక్కడి అధికారులు తెలిపారు.

నిజానికి ఇలాంటి చెత్తంతా చైనా కొనుక్కునేది. చెత్తను రీసైక్లింగ్ చేసి... యూజ్ అండ్ త్రో వస్తువుల్ని తయారుచేసేది. ఐతే... చైనా వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అమెరికా గగ్గోలు పెట్టడంతో ఒళ్లు మండిన చైనా... విదేశాల నుంచీ చెత్త కొనుగోళ్లను గతేడాది నుంచీ రద్దు చేసింది. ఇక అప్పటి నుంచీ విదేశాలు... ఇతర దేశాలకు తమ చెత్తను తరలిస్తున్నాయి. ఆ క్రమంలో వాటి కన్ను ఇండోనేసియాపై పడింది. ఇదే సమయంలో... తాము చెత్తను ఎగుమతి చేయడం ఆపేస్తున్నామని ప్రకటించిన ఆస్ట్రేలియా... ఆ మాటపై నిలబడింది. అమెరికా, జర్మనీ లాంటి దేశాలు మాత్రం ఆసియా దేశాలకు చెత్తను పంపిస్తున్నాయి.

ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో చాలా వరకూ చెత్తగా మారి... భూమిపైనా, డ్రైనేజీల్లో, సముద్ర గర్భాల్లో చేరుతున్నాయి. ఆ ప్లాస్టిక్ కణాలు గాల్లో చేరి... లేనిపోని జబ్బులకు కారణం అవుతున్నాయి. చేపలు, పక్షులు, జంతువులు... అన్నీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. అందుకే ఇండియా అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తోంది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...