Home /News /international /

INDONESIA RUNS ROAD TEST FOR BIODIESEL WITH 40 PERCENT PALM OIL HERE ARE MORE DETAILS SK

Palm Oil: పామాయిల్‌తో వాహనాల పరుగులు..పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరినట్లేనా..!

పామాయిల్ డీజిల్‌తో నడిచే కారు

పామాయిల్ డీజిల్‌తో నడిచే కారు

Indonesia: ఇప్పటికే డీజిల్‌లో పామాయిల్ కలుపుతుండగా.. దానిని మరింతగా పెంచింది. ఏకంగా 40శాతం పామాయిల్ కలపాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం నుంచి ప్రయోగాలను ప్రారంభించింది.

    పెట్రోల్ (Petrol),  డీజిల్ (Diesel) ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే పెట్రోల్, డీజిల్ ధర భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండోనేసియా (Indonesia) కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే పామాయిల్‌ (Palm oil) తోనే ఇంధన సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.  ఇప్పటికే డీజిల్‌లో పామాయిల్ కలుపుతుండగా.. దానిని మరింతగా పెంచింది. ఏకంగా 40శాతం పామాయిల్ కలపాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం నుంచి ప్రయోగాలను ప్రారంభించింది.

    Kim Jong Un : కిమ్ తీవ్ర హెచ్చరిక..ఆ దేశాలపై అణుబాంబులు వేయడానికి సి

    ప్రపంచంలోనే  పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండోనేసియా  మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఆయిల్ పామ్‌ తోటలు పెద్ద మొత్తంలో ఉంటాయి. మనదేశం కూడా చాలా వరకు పామాయిల్‌ను ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ పామాయిల్ తోటలు, ఫ్యాక్టరీలతో ఇండోనేసియాలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఈ దేశ ఆదాయంలో కూడా దీని వాటే ఎక్కువగా ఉంది. ఐతే పామాయిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చమురు నిల్వలు మాత్రం ఇండోనేసియాలో లేవు. అందుకు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఐతే ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతుండడంతో.. ఆ ఖర్చును తగ్గించుకునేందుకు పామాయిల్‌ను ఉపయోగిస్తోంది ఇండోనేసియా.



    ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో డీజిల్‌లకు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్‌‌ను వినియోగిస్తున్నారు. బయోడీజిల్‌ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. వాహనాల ఇంజిన్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. తద్వారా మైలేజీ ఎక్కువగా వస్తుంది. దీనితో ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా పెద్దగా హాని జరగదు. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు బయో డీజిల్‌ వాడకపై దృష్టిస్తాయి. ఈ క్రమంలో పామాయిల్‌నే బయో డీజిల్‌గా వినియోగించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్‌లో 30 శాతం పామాయిల్ కలపాలని చమురు ఉత్పత్తి సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ డీజిల్‌ను 12 ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలపై ఈ ప్రయోగాన్ని అమలు చేసి ఫలితాలను పరీక్షిస్తోంది. బుధవారం నుంచే పామాయిల్ బయో డీజిల్ వాహనాలను తిప్పడం ప్రారంభించారు. ట్రయల్ రన్ తర్వాత ఇంజిన్ పనితీరు, టార్క్, ఇంధన వినియోగం, కర్భన ఉద్గార వివరాలను పరిశీలిస్తారు. తద్వారా పామాయిల్‌తో నడిచే వాహనాలు ఎంత మేరకు ఉపయోపడతాయో ఈ ఏడాది లోగా చెప్పాలని అధికారులను ఇండోనేషియా ప్రభుత్వం ఆదేశించింది. వారి సమర్పించే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Indonesia, International, International news, Petrol

    తదుపరి వార్తలు