Home /News /international /

INDONESIA PASSES LAW TO SHIFT CAPITAL FROM JAKARTA TO BORNEO PVN

Capital Change : రాజధానిని తరలిస్తున్న మరో దేశం..ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indonesia Capital Change : ఇండోనేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాజధానిగా జావా ద్వీపంలోని జకర్తా ఉండగా..ఇప్పుడు దానికి 2వేల కి.మీ(1200 మైళ్లు)దూరంలోని బోర్నియా ఐలాండ్ లోని తూర్పు కాలిమాంటన్ ఫ్రావిన్స్ కు తరలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. కొత్త రాజధానిగా మారనున్న కాలిమాంటన్ ప్రాంతానికి "సుసంతర(Nusantara)"అని పేరు పెట్టారు.

ఇంకా చదవండి ...
Capital Shift : సముద్ర మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా దేశ రాజధానిని వేల కిలోమీటర్ల దూరంలోని మరో చోటుకి తరలించాలని(Capital Shift)ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిగా జావా ద్వీపంలోని జకర్తా ఉండగా..ఇప్పుడు దానికి 2వేల కి.మీ(1200 మైళ్లు)దూరంలోని బోర్నియా ఐలాండ్ లోని తూర్పు కాలిమాంటన్ ఫ్రావిన్స్ కు తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు.

కొత్త రాజధానిగా మారనున్న కాలిమాంటన్ ప్రాంతానికి "సుసంతర(Nusantara)"అని పేరు పెట్టారు. సుసంతర అంటే ఇండోనేషియాలో ద్వీప సమూహం అని అర్థం. 2024 ప్రారంభంలో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇండోనేషియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాలిమాంటన్ ప్రాంత అభివృద్ధి కోసం త్వరలోనే జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పాటు కానుందని,ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. పదేళ్ల జాతీయ ప్రాధాన్యమున్న కార్యక్రమంగా దీని చేపట్టనున్నారు.

ALSO READ Sri Lanka: శ్రీలంకలో మరింత దిగజారుతున్న పరిస్థితులు.. ఆకలి చావుల ప్రమాదం.. అయినా మొండి పట్టుదల

కొత్త రాజధాని.. తూర్పు కాలిమంటన్ ప్రావిన్స్‌లో దాదాపు 56,180 హెక్టార్లు (216 చదరపు మైళ్లు) విస్తరించి ఉంటుంది. అయితే కొత్త రాజధాని నుంచి పరిపాలన ప్రారంభించిన్పటికీ..ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా జకర్తా ఉంటుందని ఇండోనేషియా అధికారులు తెలిపారు. కాగా,కొత్త రాజధాని ఉన్న ద్వీపమైన బోర్నియా.. దట్టమైన అడవిని కలిగి ఉంటుంది. ఈ బోర్నియా ద్వీపం..ఆగ్నేయాసియాలోని అతిపెద్ద ద్వీపాలలో ఒకటి. ఈ భూభాగాన్ని ఇండోనేషియా,మలేషియా,బ్రూనై దేశాలు పంచుకుంటున్నాయి.

జకర్తా నుంచి రాజదాని తరలింపు ఎందుకు
ప్రస్తుత రాజధాని నగరమున్న జకర్తా జావా ద్వీపంలో ఉంది. జకర్తా గ్రేటర్ మెట్రో ప్రాంతంలో 3 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. జకార్తా చాలా కాలంగా తీవ్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలతో బాధపడుతోంది. ఇక వాతావరణ మార్పుల వల్ల వరదలు తీవ్రతరం అవుతాయని, 2050 నాటికి జకర్తా నగరంలో మూడవ వంతు వరకు నీట మునుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసాంద్రత కలిగిన జావా ద్వీపంలో తీవ్రమైన రద్దీ,పెరుగుతున్న సముద్ర మట్టాలని ఉటంకిస్తూ...పర్యావరణ అనుకూలమైన "స్మార్ట్" నగరాన్ని సృష్టించే లక్ష్యంతో 2019 ఏప్రిల్ లో అధ్యక్షుడు జోకో విడోడో రాజధాని తరలింపు ఆలోచనను మొదటగా ప్రస్తావించారు. కొత్త రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, అయితే మునుపటి నివేదికల ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చులు 33 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

అధిక జనాభా ఉన్న రాజధానిని మరొక చోటుకి తరలించిన దేశాల్లో ఇండోనేషియా మొదటిదేమీ కాదు. 2003లో మలేషియా తన రాజధానిని కౌలాలంపూర్ నుండి పుత్రజయకు తరలించగా...మయన్మార్ తన రాజధానిని రంగూన్ నుండి నేపిడావ్‌కు 2006లో మార్చింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Indonesia

తదుపరి వార్తలు