Indonesian: ప్రేమించాడు.. పెళ్లాడాడు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు

కుక్కర్ ను పెళ్లి చేసుకున్న వ్యక్తి

Indonesian married to Cooker: ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి ఉంటుంది. అది పిచ్చి కాదు ప్రేమ అంటారు కొందరు ఇప్పుడు ఇండోనేషియన్ ప్రేమికుడు వైరల్ అవుతున్నాడు.. ప్రేమించడం కాదు.. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇంతకీ ఎందుకో తెలుసా..?

  • Share this:
    Indonesian married to Cooker: ప్రేమ (love) గుడ్డిది అంటారు.. ఎవరు.. ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. ఇలాంటి ఎన్నో ప్రేమ కథల (love stories) గురించి వింటుంటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం.. అయితే అందులో కొన్ని చాలా చిత్రంగా అనిపిస్తాయి. సాధరణంగా పేదింటి అమ్మాయి.. పెద్దింటి అబ్బాయో.. లేద కులంతర, మతంతర పెళ్లిల్లు.. ఇలాంటివి చాలా కమన్.. అయితే ఇటీవల అమ్మాయిలను అమ్మాయిలు.. అబ్బాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం కూడా కామన్ గా నే చూస్తుంటాం. అయితే వీటన్నింటినీ మించిన ప్రేమ ఇతడిది. అసలు ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అనిపిస్తుంది. కొందరైతే ఇంట్లో పెంచుకుని కుక్కల్ని, పిల్లుల్ని ప్రేమిస్తుంటారు. కానీ ఓ ఇండోనేషియన్ (Indonesian) స్టోరీ మాత్ర వీటన్నింకీ భిన్నంగా ఉంది. అందుకే ప్రస్తుతం అతడి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. అందరూ ఆ పెళ్లి ఫోటోలపై వింత వింత కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా (Social Media) ఫ్లాట్ ఫాంలోనూ ఈ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి ఆ స్పెషల్ అని డౌట్ పడుతున్నారా..? ఇండోనేషియాలో చోటు చేసుకుంది ఈ విచిత్ర ప్రేమ ఘటన. ఓ వ్యక్తి రైస్ కుక్క‌ర్‌ను పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్క‌ర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియ‌న్ వ్య‌క్తి ఫొటోలు ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తెల్ల‌ని వెడ్డింగ్ డ్రెస్‌లో అత‌డు మెరిసిపోగా, వ‌ధువుగా ముస్తాబైన‌ రైస్ కుక్క‌ర్‌ను వైట్ డ్రెస్‌తో అలంక‌రించాడు.

    ఈ ఫొటోల్లో కొత్త జంట కెమెరాకు క‌లిసి ఫోజులు ఇవ్వ‌డం క‌నిపించింది. త‌మ పెండ్లికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌పై పెండ్లికొడుకు అనం సంత‌కాలు చేస్తూ ఓ ఫోటోలో సంద‌డి చేశాడు. మ‌రో ఫొటోలో రైస్ కుక్క‌ర్‌ను కిస్ చేస్తూ రొమాంటిక్ పోజిచ్చాడు. ఈ ఫొటోల‌కు “వైట్‌..క్వైట్‌..ప‌ర్ఫెక్ట్‌..వెరీ డ్రీమీ”అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. http://



    సెప్టెంబ‌ర్ 20న కుక్క‌ర్‌తో త‌న పెండ్లిని ప్ర‌క‌టిస్తూ ఆనం సోషల్ మీడియా పేజీలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల‌కు 44,300కు పైగా లైక్‌లు, 1,35,000 రీట్వీట్‌లు వ‌చ్చాయి. కుక్క‌ర్‌ను పెళ్లి చేసుకున్న వ్య‌క్తిపై నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. http://





    దీంతో అసలు కుక్కర్ తో పెళ్లి ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరు అయితే కుక్కరు ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు గ్రేట్ బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు..
    Published by:Nagesh Paina
    First published: