Home /News /international /

INDONESIA ISSUES TSUNAMI WARNING AFTER 7 POINT 7 MAGNITUDE EARTHQUAKE NEAR FLORES ISLAND MKS

Tsunami : భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ -Indonesiaలో టెన్షన్.. ఇండియాకూ ముప్పు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతుంది. తాజా భూకంపం తీవ్రతలో పెద్దది కావడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. వివరాలివి..

ఇంకా చదవండి ...
ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఇండో-పసిఫిక్ కలయిక ప్రాంతంలో, భూమి టెక్టానిక్ ప్లేట్లు కలిచే చోట ఉండటంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తుండటం తెలిసిందే. కొన్ని సార్లు భూకంపాలు పెను సునామీలను సృష్టించిన నేపథ్యంలో ప్రతిసారి ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతుంది. తాజా భూకంపం తీవ్రతలో పెద్దది కావడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. వివరాలివి..

ద్వీపాల సముదాయమైన ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంగా ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన భూకంపం కావడంతో సునామీ అలలు తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Karepalli : అయ్యో మనీషా.. ఎంతపని చేశావమ్మా.. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు..



ఇండోనేషియా భూకంప శాస్త్ర ఏజెన్సీ, అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థలు భూకంపం తీవ్రతను నిర్ధారించాయి. 7.7 తీవ్రత గల ఈ భూకంపంతో సునామీ తలెత్తే అవకాశం ఉండటంతో ఫ్లోరెస్ దీవులతోపాటు ఇండోనేషియా మొత్తం వణుకుతున్నది. ఇండోనేషియాలో తలెత్తే సునామీ ఇండియాను సైతం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఇండోనేషియా కేంద్రంగా 2004లో చివరిసారిగా సునామీ తలెత్తింది. భూకంప తీవ్రత 9.1తో నాడు తలెత్తిన సునామీ శ్రీలంక, ఇండియా, థాయిలాండ్ సహా తొమ్మిదిదేశాల్లోని తీరాలను ముంచేసింది. కనీసం 2,27,898 మంది మరణించారు. తాజా సునామీ హెచ్చరికపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Earthquake, Indonesia

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు