హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Indonesia: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఇండోనేసియాలో విషాదం

Indonesia: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఇండోనేసియాలో విషాదం

స్టేడియంలో అభిమానులు

స్టేడియంలో అభిమానులు

Indonesia: పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రేక్షకులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులంతా పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇండోనేసియా (Indonesia) లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 127 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   ఈస్ట్ జావాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.   ఇండోనేసియా టాప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ''లీగా 1'' (Liga 1)లో భాగంగా.. శనివారం మలాంగ్ రీజన్సీలోని కంజురుహాన్ స్టేడియం (kanjuruhan football stadium)లో ఎరీమా ఎఫ్‌సీ, పెర్సిబయా సురబాయా జట్ల మధ్య  ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఐతే  ఎరీమా ఎఫ్‌సీ టీమ్ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు స్టేడియంలో రచ్చ  చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఇతర వస్తువులు విసిరారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు.

  పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రేక్షకులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులంతా పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 34 మంది స్టేడియంలోనే మరణించారు. తొక్కిసలాటతో పాటు పలువురు ఊపిరాడక మరణించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరో 93 మంది చనిపోయారు. ఇంకా 180 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  ఈ ఘటనపై ఇండోనేసియా ఫుట్ బాల్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఇంతపెద్ద విషాద ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని.. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. కమిటీని మలాంగ్‌కు పంపించినట్లు వెల్లడించింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో లీగా 1ని వారం రోజుల పాట నిలిపివేశారు. ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు ఆడకుండా Arema FC జట్టుపై నిషేధం విధించారు. ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  కాగా, ఇండోనేసియా ఫుట్‌బాల్‌ ఆటంటే జనాలకు పిచ్చి. మన దేశంలో క్రికెట్‌ను ఎలా ఆరాధిస్తారో అక్కడ ఫుట్ బాల్‌ మ్యాచ్‌లను అలా చూస్తారు. తమకు నచ్చిన జట్టు ఓడిపోతే అభిమానులు జీర్ణించుకోలేరు. రచ్చ రచ్చ చేస్తారు. కంజురుహాన్ స్టేడియంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. గతంలోనూ పలుమార్లు ఈ తరహా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Football, Indonesia

  ఉత్తమ కథలు