Home /News /international /

INDONESIA AGREES TO PURCHASE RAFALE JET FIGHTER JETS FROM FRANCE GH VB

RAFALE Jets: ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండోనేషియా ఒప్పందం.. రక్షణ రంగం బలోపేతానికి చర్యలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రక్షణ రంగం బలోపేతానికి కీలక చర్యలు చేపట్టింది ఇండోనేషియా ప్రభుత్వం. తాజాగా ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశం, 42 రాఫెల్ జెట్‌లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

రక్షణ రంగం బలోపేతానికి కీలక చర్యలు చేపట్టింది ఇండోనేషియా(Indonesia) ప్రభుత్వం. తాజాగా ఫ్రాన్స్‌తో(France) రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశం, 42 రాఫెల్ జెట్‌లను(Rafale Jets)  కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఫ్రెంచ్ అటాక్ సబ్‌మెరైన్స్ కూడా సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఇండోనేషియాకు F-15 జెట్‌ల విక్రయాన్ని అమెరికా తాజాగా ఆమోదించడం విశేషం.

చైనా బెదిరింపుల నేపథ్యంలో ఆగ్నేయాసియాలో ఆయుధాల పోటీ..?
జకార్తాలోని వైమానిక దళం, నావికాదళంలోకి రాఫెల్ యుద్ధ విమానాలు, నావల్ గ్రూప్ అటాక్ సబ్‌మెరైన్స్ చేర్చనున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫిబ్రవరి 10న ఫ్రాన్స్‌తో ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది. జకార్తాలో ఇండోనేషియా రక్షణ మంత్రి ఫ్రెంచ్ రక్షణ మంత్రితో సమావేశమైన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ‘42 రాఫెల్‌ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. ముందు ఆరు జెట్స్, తర్వాత మరో 36 జెట్స్ మా రక్షణ దళంలో చేరనున్నాయి.’ అని వెల్లడించారు ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో.

Blasphemy: పాకిస్థాన్‌లో దారుణం.. దైవదూషణ పేరుతో మానసిక రోగిపై మూకదాడి.. వివరాలిలా..


42 విమానాలు, వాటి ఆయుధాల కాంట్రాక్టు విలువ 8.1 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆసియా-పసిఫిక్‌లో ఫ్రాన్స్ సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో జకార్తా- ప్యారిస్ మధ్య ఒప్పందం కుదరడం విశేషం. ఈ ప్రాంతంలో భారత్ తర్వాత రాఫెల్ విమానాలను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా నిలిచింది.

ఫ్రెంచ్ రాఫెల్ జెట్స్ కొనుగోలు చేసిన ఇండోనేషియా
ఈ ఒప్పందంలో ఎయిర్‌క్రూ ట్రైనింగ్, ఇండోనేషియా ఎయిర్ బేస్‌లకు లాజిస్టికల్ సపోర్ట్ కూడా భాగంగా ఉన్నాయి. ఈ ఒప్పందంలో రెండు ఫుల్-మిషన్ సిమ్యులేటర్స్ ఉన్న శిక్షణా కేంద్రం కూడా ఉంది. అమెరికన్ F-16లు, రష్యన్ సుఖోయిలు ఉన్న పాత తరం నౌకాదళాన్ని ఫ్రెంచ్ యుద్ధ విమానాలతో జకార్తా భర్తీ చేయనుంది. ఇండో-పసిఫిక్‌లో US-చైనా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఒప్పందం కుదిరింది.

‘ఇండోనేషియా 42 రాఫెల్‌ను ఆర్డర్ చేసింది. మా వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేయాలని నిర్ణయించాం. ఆసియా, ఇండో-పసిఫిక్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మా పార్ట్నర్ దేశం సాయుధ దళాల ఆధునీకరణకు దోహదపడుతున్నందుకు ఫ్రాన్స్ గర్విస్తోంది.’ అని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యుద్ధ విమానాన్ని ఇండోనేషియా ఎంచుకున్నట్లు ఫ్రెంచ్ రక్షణ మంత్రి తెలిపారు. 2004లో సేవలను ప్రారంభించిన రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

అమెరికన్ ఎఫ్15ను కొనుగోలు చేయనున్న ఇండోనేషియా
మరోవైపు ఇండోనేషియాకు 36 F-15 ID ఫైటర్లు, ఎక్విప్‌మెంట్‌ విక్రయానికి US తాజాగా ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ $13.9 బిలియన్ల వరకు ఉంటుందని పెంటగాన్ ప్రకటించింది. ఫ్రెంచ్ రాఫెల్ జెట్‌ల కోసం ఇండోనేషియా ఒప్పందంపై సంతకం చేసిన రోజునే ఈ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించడం గమనార్హం. ఫ్రాన్స్, అమెరికా నుంచి 70 కంటే ఎక్కువ జెట్‌లను ఇండోనేషియా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ISRO PSLV-C52: రాకెట్ రయ్ రయ్.. కక్ష్యలోకి 3ఉపగ్రహాలు -2022లో తొలి ప్రయోగం విజయవంతం


నౌకాదళాన్ని విస్తరిస్తున్న ఇండోనేషియా
రక్షణ ఒప్పందంలో భాగంగా జలాంతర్గామి పరిశోధన, అభివృద్ధి సహకారం కోసం ఫ్రెంచ్ నావల్ గ్రూప్‌తో ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండోనేషియా సముద్ర రక్షణను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. తమ నేవీ కోసం రెండు స్కార్పెన్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని ఇండోనేషియా చూస్తోంది. ఈ నౌకలు ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీని కలిగి ఉంటాయని, ఆయుధాలను కలిగి ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

తమ మిలిటరీని ఇండోనేషియా ఎందుకు బలపరుస్తోంది?
ఆస్ట్రేలియా, UK, US మధ్య త్రైపాక్షిక భద్రతా ఒప్పందమైన AUKUS గురించి ఇండోనేషియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాములను AUKUS అందించనుంది. ఈ జలాంతర్గాముల ఉపయోగం ఆగ్నేయాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతుందని జకార్తా భావించింది. 2021 డిసెంబర్‌లో, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజ వాయువు ప్రాజెక్టును నిలిపివేయాలని జకార్తాకు బీజింగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇండోనేషియా ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో ఉన్నప్పటికీ, తమ "నైన్-డ్యాష్ లైన్" టెరిటోరియల్ రీజిన్‌లో ఉందని చైనా చెబుతోంది.

చైనాను ఎదుర్కోవడానికి ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య ఆయుధ పోటీ
ఇటీవల దక్షిణ కొరియా నుంచి $1 బిలియన్లకు యుద్ధనౌకలను కొనుగోలు చేయడానికి ఫిలిప్పీన్స్ ఒప్పందం చేసుకుంది. ఇటీవల భారతదేశం నుంచి 375 మిలియన్ డాలర్ల బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసినట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది. మూడు జలాంతర్గాములు, అనేక కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడం ద్వారా తమ నౌకాదళాన్ని ఇండోనేషియా అప్‌గ్రేడ్ చేస్తుంది. 2011లో ఇండోనేషియా డిఫెన్స్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 5.8%గా ఉండగా.. 2017లో 9.3%కి పెరిగింది. చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు ఆగ్నేయాసియా దేశాలు తమ ఆయుధాలను పెంచుకుంటున్నాయి.

రక్షణ ఒప్పందంతో ఫ్రాన్స్‌కు ప్రయోజనం ఏంటి?
డిఫెన్స్ స్ట్రాటజీలో ఈస్ట్రన్ కంట్రీస్‌కు విలువ పెరిగిన నేపథ్యంలో ఇండోనేషియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఫ్రాన్స్ భావిస్తుంది. QUADలోని రెండు సభ్య దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపుతోంది. సెప్టెంబర్ 2021లో జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన మల్టీ-మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఆస్ట్రేలియా అకస్మాత్తుగా రద్దు చేసుకుంది.

Whatsapp Features: వాట్స‌ప్‌లో క్రేజీ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్ గురించి తెలుసుకోండి!

అణు జలాంతర్గాములను నిర్మించడానికి యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్‌లతో కొత్త రక్షణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా కుదుర్చుకుంది. దీన్నే AUKUS పేరుతో పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్, ఇండియా వంటి దీర్ఘకాల భాగస్వాములతో తన సంబంధాలను బలోపేతం చేయడానికి ఫ్రాన్స్ ఆసక్తి చూపుతోంది. AUKUS ఒప్పందంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల వైపు ఫ్రాన్స్ మొగ్గు చూపుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: France, Indonesia, Rafale Deal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు