Home /News /international /

INDO SRI LANKA RELATIONSHIP HITS ROADBLOCKS IS CHINA PLAYING DIRTY GAMES IN INDIAN OCEAN NK

Indo-Sri Lanka: దెబ్బతింటున్న ఇండియా-శ్రీలంక సంబంధాలు.. చైనా కుట్రలు పన్నుతోందా?

దెబ్బతింటున్న ఇండియా-శ్రీలంక సంబంధాలు.. చైనా కుట్రలు పన్నుతోందా? (File Image)

దెబ్బతింటున్న ఇండియా-శ్రీలంక సంబంధాలు.. చైనా కుట్రలు పన్నుతోందా? (File Image)

Indo-Sri Lanka: శాంతియుతంగా ఉండే ఇండియాకి దూరం జరుగుతూ శ్రీలంక... ఎందుకు చైనాకి తలవంచుతోంది? ఎలా చైనా కుట్రలు పన్నుతోంది? తెలుసుకుందాం.

  ఈమధ్య రెండు అంశాలు భారత్-శ్రీలంక మధ్య సత్సంబంధాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. కొలంబో రేవు దగ్గర అభివృద్ధి చేయాలనుకున్న ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ (ECT)కి సంబంధించి భారత్, జపాన్‌తో ఉన్న జాయింట్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ నుంచి గత వారం శ్రీలంక తప్పుకుంది. ఇది ఇటు భారత్, అటు జపాన్‌కి ఇబ్బందికర పరిణామమే అనుకోవచ్చు. అదే రోజు... గతేడాది జులైలో కరోనా లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వాటికి ఉపయోగపడతాయని భారత్ ఇచ్చిన 40 కోట్ల డాలర్లను శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ (CBSL) వెనక్కి ఇచ్చేసింది. ECT డీల్ విషయంలో రెండేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. 2019 నవంబర్‌లో గోటబయ రాజపక్స... శ్రీలంక అధ్యక్షుడు అయ్యాక... ఆయన సోదరుడు మహేంద రాజపక్స అధ్వర్యంలోని SLPP పార్టీ 2020 ఆగస్టులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించినప్పుడు... చైనాకి చెక్ పెడుతూ... తన పక్కనున్న దేశానికి దగ్గరయ్యేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నించింది. ఢిల్లీలో గోటబయ రాజపక్సకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు. శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్ గుణవర్దేన కూడా భారత్‌తో సంబంధాల మెరుగుదల కోసం వెంట వచ్చారు. అలాగే భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా కొలంబో వెళ్లి... కలిశారు. అలా శ్రీలంకను చైనా బుట్టలో పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  శ్రీలంక ప్రభుత్వం కూడా ఇండియా తనకు అతి దగ్గరున్న పక్క దేశం అనీ, తమ కుటుంబం అనీ చెప్పింది. అలాగే... చైనాను జస్ట్ మిత్ర దేశం అని చెప్పింది. ECT డీల్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా... మహేంద రాజపక్సా పాతపాటే పాడారు. ఇండియా పట్ల తమ వైఖరి మారదనీ, తమ సంబంధాలు మరింత పెరుగుతాయనే అన్నారు. శ్రీలంకలో ప్రముఖ ఇంగ్లీష్ డైలీ... డైలీ మిర్రర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... "లేదు... అక్కడ ఏ సమస్యా లేదు. మేం ఇండియాతో ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఈ పెట్టుబడి ప్రాజెక్టులో రెండు రకాల ఆలోచనా విధానాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులను ఇందులోకి తేవడం ప్రభుత్వ పాలసీ కాదు. చాలా మంది బౌద్ధ సన్యాసులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు." అని అన్నారు.

  భారత్, జపాన్ మాత్రం... శ్రీలంకకు కచ్చితమైన సందేశం ఇచ్చాయి. ECT ప్రాజెక్టులో ముందుకు వెళ్లాలని కోరాయి. శ్రీలంక ప్రభుత్వం మాత్రం తమ సొంత నిధులతోనే దాన్ని నిర్మించుకుంటామని చెబుతోంది. నిజానికి కరోనా సమయంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. అందువల్ల సొంతంగా దాన్ని నిర్మించే పరిస్థితి లేదని స్థానిక నిపుణులు అంటున్నారు. దీని వెనక చైనా ఉండి ఉండొచ్చని... భారత్, జపాన్‌కి చెక్ పెట్టడానికి చైనా తెరవెనక మంత్రాంగం నడిపిస్తూ ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

  india china, India Sri Lanka Relationship, china politics, china dirty games, indian ocean, ECT port project, SLPP పార్టీ, mahinda rajapaksa, gotabaya rajapaksa, ఇండియా శ్రీలంక, చైనా కుట్రలు, శ్రీలంకతో సంబంధాలు,
  చైనా చేతిలో శ్రీలంక కీలుబొమ్మ అవుతోందా? (File image)


  గత 15 ఏళ్లలో శ్రీలంకలోని చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. ఇది ఇండియాకి తలనొప్పి అంశం. హిందూ సముద్రంలోని కొలంబో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీ (CIFC)లో... చైనా హంబన్‌తోట రేవును నిర్మించింది. ఇలా చైనా ప్రతిచోట తన మార్క్ చూపిస్తోంది. రాజపక్సలు కూడా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కి వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నారు.

  గత 2 నెలలుగా చైనాకి వ్యతిరేకంగా శ్రీలంకలోని సింహళీ, ఇంగ్లీష్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ECT విషయంలో చైనా హస్తం ఉండి ఉండొచ్చనే ఆరోపణలతో రేవు కార్మికుల ట్రేడ్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. విదేశీహస్తాలు ఇందులో ఉండకూడదని డిమాండ్ చేస్తున్నాయి. ఓ శ్రీలంక షిప్పింగ్ నిపుణుడి ప్రకారం... "ECT రేవును నిర్మించేందుకు చైనా అడ్డు తగులుతోంది. ఎందుకంటే... చైనా ఆల్రెడీ హంబన్‌తోట రేవును నిర్మించుకుంది. ECT వస్తే... తమ రేవులో వ్యాపారం పోతుందని చైనా భావిస్తోంది. అందుకే ఈ కుట్రలు పన్నుతోంది" అని అభిప్రాయపడ్డారు.

  ఇది కూడా చదవండి: చనిపోయిన వాళ్ల మాటలను వాళ్లు ఎలా వింటారు.. దీనిపై సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

  తమ భూమిపై తమకు పూర్తి సార్వభౌమాధికారాలు ఉన్నాయని రాజపక్సా చెబుతున్నారు. కానీ... చైనా చేతిలో ఆయన కీలుబొమ్మలా మారారనే విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు భారత్‌తో తమిళుల అంశం నలుగుతూ ఉంది. అందువల్ల భారత్‌కి పూర్తి అనుకూలంగా శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించే అవకాశాలు లేవు. దానికి తోడు ఇప్పటికే చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక... ఆ రుణాల ఉచ్చు నుంచి బయటపడే పరిస్థితిలో లేదు.

  (DP Sathish, News18)
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: India vs srilanka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు