Home /News /international /

INDO AMERICANS WHO WON AND LOST THE US PRESIDENTIAL ELECTIONS 2020 FIND HERE MS

US POLLS 2020: అమెరికాలో మనోళ్ల కథ..! విజేతలు.. పరాజితులు వీళ్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US POLLS 2020: అమెరికా అధ్యక్షుడెవరో కొద్దిసేపట్లో అధికారికంగా తేలిపోనుంది. అగ్రదేశాన్ని ఏలెదవరో అధికారికంగా ప్రకటించడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే అమెరికాలోనే భారతీయ మూలాలున్న వ్యక్తులు సైతం  అధ్యక్ష ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో విజేతలెవరో.. పరాజితులెవరో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  అమెరికా అధ్యక్షుడెవరో తేలిపోయింది. అగ్రదేశాన్ని ఏలెదవరో అధికారికంగా నిర్ణయించడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే అమెరికాలోనే భారతీయ మూలాలున్న వ్యక్తులు సైతం  అధ్యక్ష ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమెరికా ఎన్నికలలో నిర్ణయాత్మక స్థాయిలో లేకున్నా.. భారతీయ ఓటర్లు కూడా కీలకమే. సుమారు 25 లక్షల పైనున్న భారతీయులలో చాలామంది బైడెన్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. అయితే డెమొక్రట్స్ తరఫున నిలుచున్న భారతీయులే ఎక్కువగా విజయం సాధించగా.. రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన వారు బొక్క బోర్లా పడ్డారు. అమెరికాలో గెలిచిన, ఓడిన భారతీయుల గురించి ఇక్కడ చూద్దాం..

  భారత మూలాలుండి అమెరికా లో పుట్టి పెరిగిన వారినే ఇండో అమెరికన్స్ అంటారు. వీరు అక్కడ ఓటు హక్కుకే గాక.. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హులు. అలా అర్హత సాధించిన వారిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించగా.. ముగ్గురు అపజయం పాలయ్యారని తెలుస్తున్నది. ఓడిపోయిన వారిలో.. రిక్ మెహతా, సారా గిడియాన్ ఉన్నారు. రిక్ మెహతా న్యూజెర్సీ నుంచి పోటీలో ఉండగా.. సారా మైనె నుంచి బరిలో ఉన్నారు. మైనేలో ప్రతినిధుల సభకు స్పీకర్ గా ఉన్న అర్మేనియన్ కూతురు. ఈమె రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్న సుసన్ కొలిన్స్ చేతిలో ఓడిపోయారు. కాగా కొలిన్స్ కు ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. సారా తండ్రి చాలా కాలం క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే పిల్లల వైద్యుడిగా స్థిరపడ్డారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.

  ఇక రిక్ మెహతా (రిపబ్లిక్ పార్టీ) విషయానికొస్తే.. న్యూజెర్సీ నుంచి డెమొక్రాట్ల తరఫున పోటీలో నిలిచిన కొరి బుకర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. మెహతాకు 38 శాతం ఓట్లు రాగా.. బుకర్ 60 శాతానికి పైగా ఓట్లు రాబట్టాడు.

  గెలిచినోళ్లు వీళ్లే...
  గెలిచినోళ్ల విషయానికొస్తే.. తమిళనాడుకు చెందిన రాజా కృష్ణమూర్తి (ఢిల్లీలో పుట్టి పెరిగారు) వరుసగా మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2016 లోనూ ఆయన డెమొక్రట్ పార్టీ తరఫున విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ ను సులభంగా ఓడించాడు. మొత్తం పోలైన ఓట్లలో రాజాకే 71 శాతం ఓట్లు రావడం గమనార్హం.  కృష్ణమూర్తితో పాటు డెమొక్రాట్స్ కాంగ్రెస్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇండో అమెరికన్ పవర్ ఫుల్ లేడీ కూడా ఘన విజయం సాధించారు. డెమొక్రాట్స్ అభ్యర్థి ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్ నుంచి) కూడా మూడోసారి విజయం సాధించారు. ఈమె కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. వాషింగ్టన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జయపాల్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రెయిగ్ కెల్లర్ పై జయకేతనం ఎగురవేసింది. వీరిరువురి మధ్య ఓట్ల తేడా సుమారు 70 శాతంగా ఉంది. కాగా జయపాల్.. భారత్ తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ల వంటి చట్టాలపై బహిరంగంగానే గళం వినిపించిన వ్యక్తి ఆమె.

  వీరిరువురే గాక మరో వ్యక్తి కూడా అమెరికా ఎన్నికలలో గెలుపొందాడు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న నీరజ్ అంటోని.. ఓహియో నుంచి సెనేట్ కు ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రతినిధుల సభల ఎన్నికలలో.. ఆయన డెమొక్రటిక్ కు చెందిన మార్క్ ఫోగెల్ ను ఓడించారు. ఓహియో నుంచి మొట్టమొదటి సెనేటర్ అయిన భారత సంతతి వ్యక్తిగా నీరజ్ రికార్డు సృష్టించారు. ఆయన వయసు 23 సంవత్సరాలే. యూఎస్లో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో అతడే అత్యంత పిన్న వయస్కుడు.

  వీరితో పాటు రొ ఖన్నా.. కూడా కాలిఫోర్నియా నుంచి విజయం సాధించారు. కాగా, ఈయన ఓడించింది కూడా మరో భారతీయ అమెరికన్ నే కావడం గమనార్హం. ఖన్నా చేతిలో ఓడిపోయిన వ్యక్తి పేరు రితేశ్ టాండన్. ఇక కాలిఫోర్నియా నుంచి డాక్టర్ అమీ బెరా కూడా విజయం సాధించారు. డెమొక్రాట్స్ తరఫున బరిలో ఉన్న అమీకి ఇది వరుసగా ఐదో విజయం.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: US Elections 2020, Us news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు