'సాయం నిలిపివేత'పై అమెరికాకు పాక్ కౌంటర్!

పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన సాయం నిలిపివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడంపై దుమారం రేగుతోంది. అమెరికా ఆపేసిన 300 మిలియన్ డాలర్లు తమ డబ్బు అని, తిరిగి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుతోంది.

news18-telugu
Updated: September 3, 2018, 6:04 PM IST
'సాయం నిలిపివేత'పై అమెరికాకు పాక్ కౌంటర్!
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File photo/AP)
  • Share this:
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పాకిస్తాన్‌కు వరుస షాకులు తగుల్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతలో విఫలమైందన్న కారణంతో పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన 300 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ కొత్త ప్రభుత్వానికి షాక్ తగిలినట్టైంది. అయితే అది పాక్ సైన్యానికి చేస్తున్న సాయం కాదని, తీవ్రవాదంపై యుద్ధంలో తాము చేసిన ఖర్చును తమకు తిరిగి  చెల్లించాలని పాకిస్తాన్ కోరుతోంది. సెప్టెంబర్ 5న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటన సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషి చెబుతున్నారు.

300 మిలియన్ డాలర్లు సాయం కాదు. అది పాకిస్తాన్ తీవ్రవాదులకు, తీవ్రవాదానికి వ్యతిరేక సైనిక పోరాటానికి ఉపయోగించిన డబ్బు. తాము ఖర్చుపెట్టిన ఈ నిధులనే అమెరికా తిరిగివ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు నిరాకరిస్తున్నారు. మేం ఖర్చు చేసిన తర్వాతే అమెరికా మాకు తిరిగిస్తోంది తప్ప... మాకు చేస్తున్న సాయం కాదు. మేం పాంపియోతో చర్చిస్తాం. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తాం.

షా మెహ్మూద్ ఖురేషి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి




ఇవి కూడా చదవండి:

కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?

పెట్రోల్ రేటు సెంచరీ వైపు పరుగులు!

ఇద్దరు రాయిటర్స్ రిపోర్టర్స్‌కి ఏడేళ్లు జైలు!

ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?

ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఇలా చేయండి!
Published by: Santhosh Kumar S
First published: September 3, 2018, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading