15 దేశాల ప్రభుత్వాల్లో 200 మంది భారత సంతతి నేతలదే హవా.. అమెరికా సంస్థ సర్వేలో ఆశ్చర్యకర నిజాలు

కమలా హ్యారిస్ (ఫైల్ ఫొటో)

ఉన్నత విద్యాభ్యాసం కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో దేశం దాటి విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులు కోకొల్లలు. అలా విదేశాల్లో అడుగుపెట్టిన భారతీయులు ఆయా దేశాల్లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తున్నారు. అటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు.

 • Share this:
  ఉన్నత విద్యాభ్యాసం కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో దేశం దాటి విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులు కోకొల్లలు. అలా విదేశాల్లో అడుగుపెట్టిన భారతీయులు ఆయా దేశాల్లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల సీఈవోలు అవుతున్నారు. బడా బడా కంపెనీలకు అధిపతులు అవుతున్నారు. అంతే కాదు కంపెనీలు స్టార్ట్ చేసి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాల్లో భారత సంతతి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? అన్న దానిపై అమెరికా కేంద్రంగా ఉన్న ’ఇండియాస్పోరా‘ అనే ఓ సంస్థ పరిశోధన చేసింది. ’ప్రపంచ దేశాల్లో భారత సంతతి నాయకులు-2021‘ అన్న పేరుతో ఓ ప్రత్యేక జాబితాను కూడా వెల్లడించింది. ఆ జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.

  ప్రపంచంలోని 200 మందికి పైగా భారత సంతతి నేతలు 15కు పైగా దేశాల ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నారని సర్వేలో తేలింది. వీరిలో 60 మంది కేబినెట్ ర్యాంక్ హోదాను కలిగి ఉన్నారట. సోమవారం ఈ నాయకులకు సంబంధించిన పూర్తి జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. వివిధ దేశాల్లో డిప్లొమాట్స్, లెజిస్లేటర్స్, సెంట్రల్ బ్యాంక్ అధినేతలు, న్యాయ విభాగంలోని ప్రముఖులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు కూడా ఉండటం గమనార్హం. భావి తరాలకు ఈ నాయకులు దిక్సూచిలా ఉంటారనీ, భారత సంతతి పౌరులకు వీళ్లే ఓ రోల్ మోడల్ అని ఇండియాస్పోరా సంస్థ వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి వ్యాఖ్యానించారు.
  ఇది కూడా చదవండి: నా POTTA నా ISTAM.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న కొత్త రెస్టారెంట్ పేరు.. అడ్రస్ ఎక్కడంటే..

  ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, యూఏఈ, యూకేతో పాటు అమెరికా ప్రభుత్వంలో కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయులు సేవలు అందిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. కాగా, ఈ జాబితాలో స్థానం పొందినందుకు అమెరికా కాంగ్రెస్ నేత అమీబెరా హర్షం వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ శాఖ సబ్ కమిటీ చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 20 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
  Published by:Hasaan Kandula
  First published: