Home /News /international /

INDIANS TO BENEFIT FROM NEW US BILL OVER GREEN CARD BACKLOG PVN

USA : గ్రీన్ కార్డు,వీసాల విషయంలో..భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Green Crad Rules Change : చ్​-4 వీసా ఉన్న వారు ఎలాంటి ప్రత్యేక అనుమతులు పొందకుండానే ఉద్యోగం చేసే హక్కును కల్పించాలంటూ అమెరికా చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు సహా ఇతర దేశాల వారికి లబ్ధి చేకూరుతుంది.

ఇంకా చదవండి ...
Biden Good News To Indians  : అమెరికాలో గ్రీన్ కార్డుల జారీ వ్యవహారంలో చోటుచేసుకుంటున్నజాప్యం, అగ్రరాజ్యంలో ఉంటున్న వీదేశీయులు అశలపై నీళ్ళు చల్లుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్​కార్డు జారీపై ప్రస్తుతం ఉన్న పలు నిబంధనల్లో మార్పులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం రెడీ అయింది. ఇమ్మిగ్రెంట్​ ఉద్యోగులకు సంబంధించి వారి దేశాలను బట్టి పరిమిత సంఖ్యలో గ్రీన్​ కార్డులను జారీ చేసే పద్ధతి(పర్ కంట్రీ క్యాప్) ని తొలగించాలనిఅమెరికా కాంగ్రెస్​ కమిటీ తాజాగా ప్రతిపాదించింది. కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్​కు సంబంధించిన పెర్​కంట్రీ క్యాప్​ను పెంచాలని(ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉండగా దానిని 15 శాతానికి పెంచాలని) కూడా సూచించింది.ఈ మేరకు ఈగల్​ యాక్ట్​ పేరుతో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ బిల్లును 22-14 ఓట్లతో ఆమోదించింది. జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదించిన ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్​ లలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత దీనిని బిల్లును అధ్యక్షుడు జో బైడెన్​ ఆమెదించాక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే అమెరికాలోని భారతీయులకు ముఖ్యంగా హెచ్​-1బీ వీసాపై పనిచేస్తున్న వారు లబ్ధిపొందనున్నారు.

మరోవైపు,అమెరికాలో ఉద్యోగుల కొరత నేపథ్యంలో ఆ దేశంలో హెచ్​-4 వీసా ఉన్న వారు ఎలాంటి ప్రత్యేక అనుమతులు పొందకుండానే ఉద్యోగం చేసే హక్కును కల్పించాలంటూ అమెరికా చట్టసభ్యులు ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు సహా ఇతర దేశాల వారికి లబ్ధి చేకూరుతుంది. హెచ్​-1బీ, హెచ్​-2ఏ, హెచ్​-2బీ సహా హెచ్​-3 వీసాలు ఉన్నవారి పిల్లలు, భాగస్వాములకు హెచ్​-4 వీసాను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది.

ALSO READ  Russia-Ukraine War : ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులు..భారీగా సామాన్య పౌరులు మృతి

ఇక, పై చదువుల కోసం మనవాళ్లు ఎక్కువగా అమెరికా వైపే మొగ్గు చూపుతున్నారు. గణాంకాల ప్రకారం అమెరికాలోని విద్యాసంస్థల్లో 2021లో చేరిన మన విద్యార్థుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగింది. అదేసమయంలో చైనా నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య 8 శాతానికిపైగా తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తన వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం...2021లో 12,36,748 మంది ఎఫ్‌-1, ఎం-1 వీసా విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరారని వివరించింది. 2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి 33,569 మంది విద్యార్థులు తక్కువగా వెళ్లారని, భారత్‌ నుంచి మాత్రం 25,391 మంది పెరిగారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వెళ్తున్న దేశాల్లో చైనా (3,48,992) మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో భారత్‌ (2,32,851) ఉంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: H1B Visa, Joe Biden, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు