Home /News /international /

INDIANS SHOULD COME TO HOME IN SPECIAL FLIGHT FROM AFGHANISTAN ASKS CENTRE AK

Indians Airlift: ప్రత్యేక విమానంలో వచ్చేయండి.. ఆఫ్గన్‌లోని భారతీయులకు కేంద్రం పిలుపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indians Airlift: తాలిబన్లకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే నగరంలోకి కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్టు ప్రకటించారు.

    ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల ప్రభావం పెరుగుతోంది. దీంతో అక్కడ మళ్లీ అసాంఘిక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ఆఫ్ఘన్‌లోని తమ పౌరులను అన్ని దేశాలను వెనక్కి రప్పిస్తున్నాయి. తాజాగా మన దేశం కూడా అక్కడున్న భారతీయులను వెనక్కి రప్పించే ప్రక్రియ మొదలుపెట్టింది. ఆఫ్ఘన్‌లోని భారతీయులు ప్రత్యేక విమానం ద్వారా మజర్ ఈ షరీఫ్ నగరం నుంచి ప్రయాణం కావాలని కేంద్రం కోరింది. మజర్ ఈ షరీఫ్‌పై తాము దృష్టి పెట్టామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. దీంతో కేంద్రం అప్రమత్తమైంది.

    తాలిబన్లకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే నగరంలోకి కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్టు తెలిపారు. గత మే నెల నుంచి ఆఫ్ఘన్‌లోని అమెరికా బలగాలు వెనక్కి వచ్చేస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దేశంలోని పలు జిల్లాలు తాలిబన్ల చేతుల్లోకి వెళుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ మరికొద్ది రోజుల్లోనే తాలిబన్ల వశమవుతుందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Afghanistan, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు