100 ఏళ్లు గడిచినా భారత్‌కు క్షమాపణ చెప్పని బ్రిటన్...ఎందుకో తెలుసా...?

భారత స్వాతంత్ర్యసమరంలో నెత్తుటి జ్జాపకం మిగిలిన జలియన్ వాలా బాగ్ మారణహోమానికి నేటితో వందేళ్లు గడిచాయి. ఈ దుర్ఘటన జరిగి వంద సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ భారతీయుల మనస్సులను కలిచి వేస్తున్న గాయంగానే మిగిలింది.

news18-telugu
Updated: April 8, 2019, 3:14 PM IST
100 ఏళ్లు గడిచినా భారత్‌కు క్షమాపణ చెప్పని బ్రిటన్...ఎందుకో తెలుసా...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత స్వాతంత్ర్యసమరంలో నెత్తుటి జ్జాపకం మిగిలిన జలియన్ వాలా బాగ్ మారణహోమానికి నేటితో వందేళ్లు గడిచాయి. ఈ దుర్ఘటన జరిగి వంద సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ భారతీయుల మనస్సులను కలిచి వేస్తున్న గాయంగానే మిగిలింది. అయితే వంద సంవత్సరాలు గడిచినా మరిచిపోని ఈ నెత్తుటి గాయానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాకపోవడం భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తోంది. లండన్ లోని పలు సిక్కు సంఘాలు జలియన్ వాలా బాగ్ మారణహోమంపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి అధికారిక క్షమాపణలు కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ సభలో హారో ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మ్యాన్ జలియన్ వాలా బాగ్ ఘటనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై కేబినేట్ మంత్రి మార్క్ ఫీల్డ్ చర్చ జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందనే... సంగతి ముందుగానే ఊహించలేమని బ్రిటన్ కు చెందిన భారతీయులు తెలిపారు.

ఇదిలా ఉంటే జలియన్ వాలా బాగ్ ఘటనపై గతంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ హోదాలో విన్‌స్టన్ చర్చిల్ ఖండించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. అలాగే 1997లో బ్రిటన్ రాణి జలియన్ వాలా బాగ్ పర్యటనలో భాగంగా కూడా క్షమాపణలు తెలిపింది. 2013లో సైతం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా క్షమాపణలు తెలిపినప్పటికీ, అవి అధికారిక ప్రకటనలు కావని బ్రిటన్‌లోని భారతీయ సంఘాలు ప్రకటించాయి.

2017లో సైతం లార్డ్ మేఘనాధ్ దేశాయ్, లార్డ్ రాజ్ లుంబా యూకే ప్రధాని థెరిసాను ఉద్దేశిస్తూ లేఖరాస్తూ...బ్రిటన్ పార్లమెంటు నుంచి అధికారిక రూపంలో క్షమాపణ కావాలని తెలిపారు. అయితే దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading