హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

‘అక్కడ కూడా మన డామినేషనే’.. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్స్ వీళ్లే..

‘అక్కడ కూడా మన డామినేషనే’.. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్స్ వీళ్లే..

జో బైడెన్, కమలా హారిస్

జో బైడెన్, కమలా హారిస్

అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ పాలనా సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయ-అమెరికన్లు ఉండటం గమనార్హం. ఇప్పటికే కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలను చెపట్టనున్న తొలి మహిళగా కమలా రికార్డు సృష్టించింది.

ఇంకా చదవండి ...

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధమైంది. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై భారీ విజయాన్ని అందుకున్నట్లు యూఎస్ ఎలక్ట్రోరల్ కాలెజ్ (US Electroral college) ఈ వారం ప్రారంభంలోనే ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనా సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయ-అమెరికన్లు (Indo-Americans) ఉండటం గమనార్హం. ఇప్పటికే కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్ష (Vice President) పదవి స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలను చెపట్టనున్న తొలి మహిళగా కమలా రికార్డు సృష్టించింది. కమలా కాకుండా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ (Administration) లో కొంతమంది భారతీయ అమెరికన్లు కీలక పదవులను చేపట్టారు. నీరా టాండన్ OMB (Office Management and Budget) సెక్రటరీగా నియామితులయ్యారు. భారత మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించిన నీరా మ్యాసాచుట్స్ లోని బెడ్ పోర్డ్ లో పెరిగారు. డెమక్రటిక్ పార్టీలో ఎన్నో కీలక పదవులను నిర్వహించారు.

ఇండో-అమెరికన్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి.. బైడెన్-హ్యారిస్ కోవిడ్-19 (Covid-19) టాస్క్ ఫోర్స్ కో-చైర్మెన్ గా నియమితులయ్యారు. ఇందులో డాక్టర్ సెలెన్ గౌండర్, డాక్టర్ అతుల్ గవాండే కూడా భాగమయ్యారు. వివేక్ మూర్తి కుటుంబం కర్ణాటకకు చెందినవారు. గౌండర్ తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి. బైడెన్-హ్యారిస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ (Covid-19 Taskforce) లో వీరు కాకుండా చాలా మంది ఇండో-అమెరికన్లు పలు పదవుల చేపట్టనున్నారు. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ అర్జున్ మజూందార్.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ART(Department of Energy ART)కి నేతృత్వం వహించనున్నారు. డాక్టర్ రాహుల్ గుప్తా నేషనల్ డాక్టర్ కంట్రోల్ పాలసీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇదే విధంగా కిరణ్ అహుజా.. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, మాలా అడిగా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్, పావ్నీత్ సింగ్ జాతీయ భద్రతా మండలికి పోలీసు డెరక్టర్ గా నియామితులయ్యారు. సీమా నందా బైడెన్-హ్యారిస్ పరిపాలనలో యూఎస్ కార్మిక శాఖలో కీలక పదవి చేపట్టనుండగా.. పునీత్ తల్వార్ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ లో ఓ భాగంగా ఉన్నారు. డాక్టర్ భవ్య ల

First published:

Tags: Joe Biden, Kamala Harris, United states, US Elections 2020

ఉత్తమ కథలు