అమెరికా సముద్రంలో మునిగి తెలుగు విద్యార్థి దుర్మరణం

ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్ర తీరంలో ఈత కొడుతుండగా, భారీ అల విరుచుకుపడటంతో శ్రావణ్ కుమార్ మునిగిపోయాడు.

news18-telugu
Updated: April 23, 2019, 3:41 PM IST
అమెరికా సముద్రంలో మునిగి తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలో మృతిచెందిన శ్రావణ్ కుమార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా అశోక్ నగర్ బస్తీకి చెందిన 27ఏళ్ల శ్రావణ్ కుమార్ అమెరికాలోని బోస్టన్ లో చదువుకుంటున్నాడు. ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. సముద్ర తీరంలో ఈత కొడుతుండగా, భారీ అల విరుచుకుపడటంతో శ్రావణ్ కుమార్ మునిగిపోయాడు. ఈ ఘటనలో అతని స్నేహితులు తప్పించుకోగలిగారు. స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఒకరోజు మొత్తం గాలించగా భారత్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో మృతదేహం లభించింది. సోమవారం శ్రావణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని అతడి సోదరుడికి సమాచారం అందజేశారు. ప్రస్తుతం శ్రావణ్ తల్లిదండ్రులు వరంగల్‌లో మరో కొడుకు వద్ద నివాసముంటున్నారు.

శ్రావణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా కు వెళ్ళాడు. అమెరికాలో ఐటి పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడు. బెల్లంపల్లి కి చెందిన సింగరేణి కార్మికుడు రెడ్డి రాజాం మాలతి లకు నలుగురు కుమారులు. చిన్న కుమారుడైన శ్రావణ్ అమెరికాలో చదువుకోవలన్నా కోరికతో 2014 లో ఆ దేశానికి వెళ్ళాడు. తల్లిదండ్రులు, సోదరుని ప్రోత్సహంతో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తూ, అక్కడ ఓ హోటల్‌ స్వయంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం కూడా జరిగింది. ఇలా ఎన్నో ఆశలతో భవిష్యత్తు ను బంగారు బాటలో అనుకోని ప్రమాదం అల రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది.

ఇది కూడా చూడండి:-


First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>