Mermaid Plant: ఈ మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా..? కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు.. పేరేంటంటే జలకన్య

జలకన్య మొక్కను కనుక్కొన శాస్త్రవేత్తలు

భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో కనుగొన్న ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు.

  • Share this:
    భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. ఈ మొక్కకు చాలా ప్రత్యేకమైనదిగా గుర్తించారు. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ పుష్పంతో చాలా ప్రయోజనాలు ఉన్నట్టు గుర్తించారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో ఈ మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా కనుకున్న ఈ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ఓ పేరు పెట్టారు. ఆ మొక్కతో పాటు ఆ పేరు కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ఆ మొక్క పేరే తెలుగోలో జలకన్య. ఇంగ్లీష్ లో దీన్ని మెరమైడ్‌ ( Meramaid) అంటారు. ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఈ మొక్కకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంటున్నారు.

    2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆ సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. నాలుగు దశాబ్దాల్లో ఇది మొదటిగా పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నెలల పాటు ఆ మొక్కపై పరిశోధనలు చేశారు. ఆ మొక్క డీఎన్‌ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు.

    ఈ మొక్కకు మెరమైడ్‌ అని నామకరణం చేసిన శాస్త్రజ్ఞులు మొక్కకు శాస్త్రీయ నామం ‘అసిటబులేరియా’ అని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత అని అర్థం. ఈ కొత్త మొక్క అందంగా ఉంది. ఆకు తక్కువ మందంలో ఉండి సున్నితంగా ఉంది. దీంతో గొడుగుల మాదిరి ఆకులు ఉండడం విశేషం. ఆ గొడుగుల్లోనే జలకన్య కనిపిస్తోందని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఫెక్లీ బస్త్‌ వివరించారు. ఈ మొక్క ఒకే బక్క భారీ కణంతో తయారైనట్లు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published: