Modi-Biden: ఈ నెల 24వ తేదీన మోదీ-బైడెన్ భేటీ.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఇవే..

జో బైడెన్, నరేంద్ర మోదీ

Modi-biden: ఆరు నెలల విరామం తరువాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Modi) మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ సారి ఆయ‌న అమెరికా(America)కు వెళ్ల‌నున్నారు. 24వ తేదీన బైడెన్ తో మోదీ భేటీ కానున్నారు.

 • Share this:
  PM Modi TOur: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొంత కాలానికే నరేంద్ర మోదీ (Narendra Modi) వరుస విదేశీ పర్యటనలు చేపట్టారు. భారత్ లో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తరువాత కరోనా (Corona).. లాక్ డౌన్ (Lockdown) కారణాలతో కేవలం వర్చువల్ మీటింగ్ లకే ఆయన పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల నుంచి కాస్త బయట పడుతుండడంతో మళ్లీ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (ప్రధాని నరేంద్ర మోదీ) త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్‌ (Jo Biden)తో భేటీ కాబోతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(Modi) ఆరు నెల‌ల త‌ర్వాత మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ సారి ఆయ‌న అమెరికా(America)కు వెళ్ల‌నున్నారు. క్వాడ్ లీడర్ సమ్మిట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) యొక్క ఉన్నత స్థాయి స‌మావేశంలో ఆయ‌న పాల్గొననున్నారు. ఈ స‌మావేశం సెప్టెంబ‌ర్ 24, 2021నఅమెరికా వాషింగ్ట‌న్‌లో జ‌ర‌గ‌నుంది. ప్ర‌త్యేక స‌మావేశంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడ‌న్‌, ఆస్ట్రేలియా(Australia) ప్ర‌ధాని స్కాట్ మోరిసన్, జ‌పాన్(JApan) ప్ర‌ధాని యోషిహిదే సుగాతో కాలిసి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పాల్గొన‌నున్నారు. నాలుగు దేశాల నాయకులకు ఆతిథ్యమిస్తున్న మొదటి వ్యక్తి క్వాడ్(Quad) శిఖరాగ్ర సమావేశం ఇది. మార్చిలో, జో బిడెన్ వర్చువల్ ఫార్మాట్‌లో క్వాడ్ లీడర్ల మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. అనంత‌ర ప్ర‌స్తుతం ప్ర‌త్యేక్షంగా ఈ స‌మావేశం

  ఈనెల 24న మోదీ, జోబైడెన్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని వైట్‌హౌస్‌ వర్గాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక మోదీతో జరిగే తొలి భేటీ ఇదే కావడం విశేషం. దీంతో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు యూఎస్‌ ప్రెసిడెంట్‌ కార్యక్రమాల షెడ్యూల్‌లో మోదీతో సమావేశాన్ని ఖరారు చేశారు. 2019లో చివరిసారి మోదీ అమెరికాలో పర్యటించారు. కరోనా అనంతరం మోదీ జరపబోయే రెండో విదేశీ పర్యటన ఇదే! మార్చిలో ఆయన బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మోదీతో సమావేశానంతరం జపాన్‌ ప్రధాని సుగాతో బైడెన్‌ భేటీ అవుతారని అధికారులు చెప్పారు.

  ఇదీ చదవండి: కంపెనీ వేరైనా కలర్లు అవే.. బీర్ సీసా కలర్ ఎందుకు ఆ రెండు రంగుల్లోనే ఎందుకు ఉంటుందో మీకు తెలుసా

  ఛేఅక్టోబర్‌ 24న తొలిసారి క్వాడ్‌ దేశాల అధినేతల సమావేశం వైట్‌హౌస్‌లో జరగనుంది. ఇందులో బైడెన్, మోదీ, సుగా, స్కాట్‌మారిసన్‌ పాల్గొంటారు. ఈఏడాది జరిపిన క్వాడ్‌ వీడియో సమావేశం అనంతరం జరిగిన పురోగతిని రాబోయే సమావేశంలో సమీక్షిస్తారు. క్వాడ్‌ దేశాల వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కూడా చర్చలుంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. అన్నింటికన్నా ముఖ్యంగా తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, నూతన టెక్నాలజీ వినియోగం, వాతావరణ మార్పు తదితర కీలక అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావిస్తారని తెలిపింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంపై నేతలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. గురువారం తొలిసారి బైడెన్‌ ఐరాసలో ప్రసంగించనున్నారు. అక్కడ స్కాట్‌ మారిసన్‌తో సమావేశం జరిపి తిరిగి వచ్చాక బ్రిటన్‌ ప్రధానితో చర్చలు జరుపుతారని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.
  Published by:Nagesh Paina
  First published: