Home /News /international /

INDIAN PASSPORT GETS STRONGER INDIANS CAN NOW TRAVEL 60 COUNTRIES VISA FREE LIST HERE MKS

Visa Free for Indians : వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లొచ్చు -భారత పాస్‌పోర్ట్ పవర్ పెరిగిందిగా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian passport gets stronger Indians can now travel 60 countries visa free list here mks | ఇండియన పాస్‌పోర్ట్ సామర్ధ్యం మరింత మెరుగైంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో గత ఏడాది ర్యాంకింగ్స్‌లో 90వ స్ధానం నుంచి భారత్ ఏకంగా ఏడు స్ధానాలు ఎగబాకి 83వ ర్యాంక్‌ను సాధించింది. దీంతో భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో వీసా లేకుండానే అడుగుపెట్టవచ్చు. పూర్తి వివరాలు, ఆ దేశాల జాబితా ఇదే..

ఇంకా చదవండి ...
భారత పౌరుడు అనే గుర్తింపునకు ప్రపంచ దేశాల్లో బ్రాండ్ వాల్యూ పెరిగిందిప్పుడు. 2021తో పోలిస్తే తాజా త్రైమాసికంలో ఇండియన పాస్‌పోర్ట్ సామర్ధ్యం మరింత మెరుగైంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో గత ఏడాది ర్యాంకింగ్స్‌లో 90వ స్ధానం నుంచి భారత్ ఏకంగా ఏడు స్ధానాలు ఎగబాకి 83వ ర్యాంక్‌ను సాధించింది. దీంతో భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో వీసా లేకుండానే అడుగుపెట్టవచ్చు. పూర్తి వివరాలివే..

2006 నుంచి భారత్ 35 గమ్యస్ధానాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అర్హత సాధిచింది. 2006లో ఓ వ్యక్తి సగటున 57 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 107 దేశాలకు పెరిగిందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇందులోనూ అసమానతలను సంస్ధ ప్రస్తావించింది. స్వీడన్‌, అమెరికా వంటి దేశాల జాతీయలు 180 గమ్యస్ధానాలకు వీసా రహిత ప్రయాణం సాగిస్తుండగా అంగోలా, కామెరూన్‌, లావోస్ పాస్‌పోర్టులు కలిగిన వారు కేవలం 50 దేశాల్లోనే వీసా లేకుండా అడుగుపెట్టగలుగుతున్నారని పేర్కొంది.

punjab : సిద్దూ వన్ మ్యాన్ ఇన్నింగ్స్: హైకమాండ్‌పై ధిక్కారం, సీఎం చన్నీ ఫొటో ఫసక్! టార్గెట్ అదేనా?



2022 తొలి క్వార్టర్‌కు గాను ప్రకటించిన ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో భారత్ సాటోం, ప్రన్సిప్‌లతో కలిసి 83వ ర్యాంక్‌ను పంచుకుంటుండగా, రువాండా..ఉగాండా దేశాల తర్వాత స్ధానంలో భారత్ నిలవడం విశేషం. ఇక భారతీయులు వీసా లేకుండా ఏయే దేశాల్లో ప్రయాణించచ్చో జాబితా ఇదే. నిజానికి భారతీయులకు వీసా రహిత దేశాలు నిర్దిష్ట కాలానికి మాత్రమేనని మనం గుర్తుంచుకోవాలి..

PM Modi : తన రికార్డు తానే బద్దలుకొట్టిన మోదీ -ప్రాంతీయ అసమానతలపైనా కీలక వ్యాఖ్యలు



కేవలం పాస్ పోర్ట్ తోనే వీసా లేకుండా నేపాల్ లో భారతీయులు నిరవధిక సమయం ఉండొచ్చు. అదే భూటాన్ లో - 6 నెలలు, ఇండోనేషియా - 30 రోజుల వరకు, ఖతార్ - 30 రోజుల వరకు, పాలస్తీనా - 3 నెలల వరకు (మీరు గాజా స్ట్రిప్ ద్వారా ప్రవేశించలేరు), మైక్రోనేషియా - 30 రోజుల వరకు, మాల్దీవులు - 90 రోజులు బార్బడోస్ - 90 రోజుల వరకు, బ్రిటిష్ వర్జిన్ దీవులు - 30 రోజుల వరకు, కుక్ దీవులు - 31 రోజుల వరకు, డొమినికా - 6 నెలల వరకు, ఎల్ సాల్వడార్ - 90 రోజుల వరకు, ఫిజీ - 4 నెలల వరకు, గ్రెనడా - 3 నెలల వరకు, హైతీ - 3 నెలల వరకు భారతీయులు ఉండొచ్చు. ఇక

cm kcr : లక్షల నాగళ్లతో modiపై తిరుగుబాటు.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిద్దామంటూ..



జమైకాకు వీసా లేకుండా వెళితే 30 రోజుల వరకు భారతీయులు ఉండొచ్చు, మకావు - 30 రోజుల వరకు, మోంట్‌సెరాట్ - 30 రోజుల వరకు, నియు - 30 రోజుల వరకు, ఉత్తర సైప్రస్ - 3 నెలల వరకు, పిట్‌కైర్న్ దీవులు - 14 రోజుల వరకు, సెయింట్ కిట్స్ & నెవిస్ - 3 నెలల వరకు , సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ - 1 నెల వరకు, సెనెగల్ - 90 రోజుల వరకు, సెర్బియా - 30 రోజుల వరకు, స్వాల్‌బార్డ్ - నిరవధిక సమయం, ట్రాన్స్‌నిస్ట్రియా - 45 రోజుల వరకు, ట్రినిడాడ్ మరియు టొబాగో - 90 రోజుల వరకు, ట్యునీషియా - 90 రోజుల వరకు,టర్క్స్ మరియు కైకోస్ దీవులు - 90 రోజుల వరకు, వనాటు - 30 రోజుల వరకు మాత్రమే మీరు అక్కడ వీసా లేకుండా వెళ్లే అవకాశం పొందచ్చు.
Published by:Madhu Kota
First published:

Tags: India, Passport, Travel, Visa

తదుపరి వార్తలు