• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • INDIAN ORIGIN SWATI MOHAN PART OF NASA MISSION MARS BECOME INTERNET SENSATION AK GH

Mission Mars-Swati Mohan: నాసా మిషన్ మార్స్‌లో మన అమ్మాయి.. ఇంటర్నెట్‌లో మార్మోగుతున్న పేరు

స్వామి మోహన్

Mission Mars-Swati Mohan: స్వాతికి సంవత్సరం వయసు ఉండగానే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. ఆమె ఉత్తర వర్జీనియా, వాషింగ్టన్ DCలో పెరిగింది.

  • Share this:
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడి మీదకు పంపిన పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మార్స్ రోవర్ అంగారకుడి పైకి సురక్షితంగా వెళ్లేందుకు, అక్కడ గండాలన్నీ దాటి ల్యాండ్ అయ్యేందుకు నాసా టీమ్ ఎంతో కష్టపడిందనే చెప్పుకోవాలి. ఆ టీమ్ లో మన భారత సంతతి మహిళ స్వాతి మోహన్ కూడా ఉండడం మనకెంతో గర్వకారణం. ఆమె మిషన్ మార్స్-2020 ప్రాజెక్టులో గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ ఆపరేషన్స్‌కు ప్రతినిధిగా ఉన్నారు. నాసా పంపిన అంతరిక్ష నౌక పర్సెవరెన్స్ రోవర్‌ అనుకున్న మార్గంలో అంగారకుడి మీదకు వెళ్లడంలో తన సేవలు అపారం. రోవర్ ల్యాండ్ అయ్యే సమయంలో ఆమె కామెంట్రీ కూడా చెప్పడం విశేషం. ఆ సమయంలో ఆమె మిషన్ కంట్రోల్ విభాగం నుంచి ప్రాజెక్టు పనితీరును వెల్లడించారు.

స్వాతికి సంవత్సరం వయసు ఉండగానే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. ఆమె ఉత్తర వర్జీనియా, వాషింగ్టన్ DCలో పెరిగింది. కార్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్ (ఆస్ట్రోనాటిక్స్‌)లో M.S. చదివింది. అనంతరం ఇదే విభాగం నుంచి Ph.D. పూర్తి చేసి, నాసాలో ఉద్యోగం దక్కించుకుంది. నాసా గతంలో ప్రారంభించిన కాసినీ మిషన్‌లో కూడా స్వాతి పనిచేశారు. మిషన్ మార్స్ ప్రాజెక్టును నాసా 2013లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె తన బృందంతో కలిసి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు. గంటకు సుమారు 12,000 మైళ్ల వేగంతో దూసుకుపోతున్న రోవర్‌ను సరైన దిశలో మృదువుగా ల్యాండింగ్ చేయడానికి ఆమె చేసిన కృషి అద్భుతమైనదనే చెప్పుకోవాలి.

ఆ విభాగానికి అధిపతి
ప్రాజెక్టులోని GN&C (గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్) సబ్ సిస్టమ్, ప్రాజెక్ట్ ఇతర విభాగాలకు మధ్య స్వాతి ప్రైమరీ కమ్యూనికేషన్‌గా ఉన్నారు. GN&C టీమ్ ట్రైనింగ్, మిషన్ కంట్రోల్ స్టాఫింగ్‌కు బాధ్యతలు వహిస్తున్నారు. మిషన్ కంట్రోల్ రూమ్‌లో GN&C ఉపయోగించే పాలసీలు, ప్రక్రియలను షెడ్యూల్ చేస్తున్నారు. పర్సెవరెన్స్ రోవర్ ల్యాండింగ్ నేపథ్యంలో టీమ్‌లో ఆపరేషన్స్ లీడ్‌గా ముందుండి తన టీమ్ ని ముందుకు నడిపింది స్వాతి.

ప్రశంసిస్తున్న భారతీయులు
తాజాగా స్వాతి మిషన్ మార్స్ కు కామెంట్రీ చెబుతున్న వీడియోను నాసా ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఈమె గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. స్వాతి కామెంట్రీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ‘నేను బొట్టు పెట్టుకొని క్లాస్‌కు వెళ్లినందుకు నన్ను చాలామంది ఏడిపించారు. నువ్వు అలాంటివాళ్ల కళ్లు తెరిపించావు. థ్యాంక్యూ...’ అని లండన్‌కు చెందిన ఒక మహిళ ట్వీట్ చేసింది. డాక్టర్ స్వాతి మోహన్ ఈతరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆస్ట్రో ఫిజిస్ట్ కరణ్ జానీ ట్వీట్ చేశారు. పర్సెవరెన్స్ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో చాలామంది ప్రముఖులు స్వాతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


https://twitter.com/NASA/status/1362503463113003014?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362503463113003014%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29238010684135020804.ampproject.net%2F2102060044003%2Fframe.html


https://twitter.com/anulikesstars/status/1362508002725683201?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362508002725683201%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29238010684135020804.ampproject.net%2F2102060044003%2Fframe.html


https://twitter.com/nushkino/status/1362517264084447232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362517264084447232%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29238010684135020804.ampproject.net%2F2102060044003%2Fframe.html


https://twitter.com/DrSwatiMohan/status/1362394636237463560?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362394636237463560%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29238010684135020804.ampproject.net%2F2102060044003%2Fframe.html


https://twitter.com/AstroKPJ/status/1362509453396951040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362509453396951040%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-29238010684135020804.ampproject.net%2F2102060044003%2Fframe.html

భారతీయ సంస్కృతికి గుర్తుగా ఆమె బొట్టు ధరించి, సంప్రదాయ దుస్తుల్లో ఆఫీసుకు వెళ్తుంది. ఈ వివరాలన్నీ బయటకు రావడంతో స్వాతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రశంసిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: