భారత సంతతికి చెందిన నిక్కీహేలీ 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. రిపబ్లికన్ నాయకురాలిగా ఉన్న నిక్కీ హేలీ(Nikki Haley) ఈ మేరకు వెల్లడించారు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ US రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) మొదటి ప్రధాన సవాలుదారుగా మారారు. 2024లో వైట్‌హౌస్‌కి తన మాజీ బాస్‌ను సవాలు చేయనని ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. రెండేళ్ల క్రితం ఆమె తాను ట్రంప్‌కు పోటీ కాదని అన్నారు. కానీ ఇప్పుడు ఆమె మనసు మార్చుకున్నారు. హేలీ తన తదుపరి ప్రణాళికలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను అని నిక్కీ హేలీ ఆ వీడియోలో పేర్కొంది.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌పై(Joe Biden) పోటీ చేసే సూచనలను గత నెలలోనే ఇచ్చారు. జనవరిలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిక్కీ హేలీ.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా ? అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్ప్లలేదు. ఇది కొత్త తరానికి సమయమని.. ఇది కొత్త నాయకత్వానికి సమయమని అన్నారు. మన దేశాన్ని తిరిగి తీసుకునే సమయమంటూ చెప్పుకొచ్చారు. అమెరికా పోరాడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
జో బిడెన్ రెండోసారి పదవికి అర్హులు కాదని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అన్నారు. నాయకత్వం వహించి ఎన్నికల్లో గెలుపొందగల రిపబ్లికన్లను మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
America Aliens: అమెరికా గగనతలంలో గ్రహాంతర జీవులు? అగ్రరాజ్యం కూల్చేసింది వాటినేనా?
Weird Valentines Day: అక్కడ అమ్మాయిలే అబ్బాయిల వెంట పడతారు! ఎంత లక్కో కదా భయ్యా
నిక్కీ హేలీకి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంతో సంబంధం ఉంది. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా. అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధవా, తల్లి రాజ్ కౌర్ రంధవా. వాళ్లు అమృత్‌సర్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America