Home /News /international /

INDIAN ORIGIN GIRL FROM GUNTUR HONORED BY US PRESIDENT TRUMP BS

గుంటూరు బాలికను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

గుంటూరు బాలికను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

గుంటూరు బాలికను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

గుంటూరు బాలికకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్య అనే బాలికకు సత్కారం జరిగింది.

    గుంటూరు బాలికకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్య అనే బాలికకు సత్కారం జరిగింది. గుంటూరుకు చెందిన అన్నపరెడ్డి శ్రావ్య(10) తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని హన్నోవర్‌లో ఉంటోంది. ఆమె తండ్రి అక్కడే ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. అయితే, కరోనాపై పోరాడుతున్న అమెరికా వైద్య సిబ్బందికి తన వంతుగా వంద బాక్సుల బిస్కెట్లు అందించింది. అంతేకాదు.. సిబ్బందిని ప్రోత్సహించేలా గ్రీటింగ్ కార్డులను పంపింది. ఈ చిన్నారి చిన్న సాయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆకర్షించింది. ఆయనే స్వయంగా శ్రావ్యతో పాటు మరో ఇద్దరు బాలికలను వైట్ హౌజ్‌కు పిలిపించుకొని సత్కరించారు. ఈ సందర్భంగా ఆ బాలిక మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని తెలిపింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Donald trump, Guntur, USA

    తదుపరి వార్తలు