లంచం కేసులో భారతీయుడికి జైలు... సింగపూర్‌లో సంచలన కేసు...

Indian Jailed in Singapore : ఆలస్యంగానైనా బంగారం స్మగ్లింగ్‌కి సంబంధించిన ఓ వ్యవహారం వెలుగులోకి రావడంతో వారం రోజుల్లో ముగ్గురు భారతీయులు జైలుకెళ్లారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 12:19 PM IST
లంచం కేసులో భారతీయుడికి జైలు... సింగపూర్‌లో సంచలన కేసు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సింగపూర్‌లోని ఛాంగీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీ బ్యాగుల్ని బరువు చూసే... భారతీయుడైన హితేష్ కుమార్ చందూభాయ్ పటేల్... లంచం కేసులో బుక్కయ్యారు. ఈ కేసులో ఆయనకు 8 వారాల జైలుశిక్షతోపాటూ... రూ.41,152.2 (800 సింగపూర్ డాలర్లు) ఫైన్ విధించింది కోర్టు. ఎయిర్‌పోర్ట్‌లోని లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్‌ UBTSలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా 2015 జనవరి 2016 నంవబర్ మధ్య పనిచేశారు చందూభాయ్. టైగర్ ఎయిర్ సంస్థ విమానాలకు సంబంధించి... బోర్డింగ్ గేట్స్ దగ్గర ప్రయాణికులకు సాయం చెయ్యడం, చెక్ ఇన్ కౌంటర్స్ పరిశీలించడం వంటివి చందూభాయ్ నిర్వహించే పనుల్లో కొన్ని.

ఇండియాకి చెందిన గోపాల కృష్ణ రాజు అనే ప్రయాణికుడి దగ్గర ఆయన లంచం తీసుకున్నారు. గోపాల కృష్ణ సింగపూర్‌లో బంగారం కొని, దాన్ని చెన్నైలో అమ్మేందుకు తరలించేవారు. తన వ్యాపారాన్ని కొరియర్ సర్వీసుల ద్వారా చెయ్యించాల్సిన గోపాల కృష్ణ దానికి బదులుగా... ప్రయాణికులకే బంగారాన్ని ఇచ్చి... చెన్నైలో తన ఏజెంట్లకు చేరవేయమని చెప్పేవారు. ఇందుకోసం ప్రయాణికులకు కొంత కమిషన్ ఇచ్చేవారు. బ్యాగుల బరువు విషయంలో ఎలాంటి సమస్యలూ రాకుండా... 2016 జనవరి నుంచీ అక్టోబర్ వరకూ... చందూభాయ్ పటేల్‌కి గోపాలకృష్ణ... లంచం రూపంలో డబ్బులు, భోజన సదుపాయాలు కల్పించారు. దీనికి సంబంధించి 2018 జులై 13న న్యూస్ పేపర్‌లో స్టోరీ వచ్చింది. దాంతో సింగపూర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్ సర్వీసుల విభాగం అంతర్గత దర్యాప్తు జరిపించింది. అందులో చందూభాయ్ పటేల్ నిర్వాకం బయటపడింది.

వారం రోజుల్లో ఇలాంటి తప్పులు చేసి జైలుకు వెళ్లిన వారిలో చందూభాయ్ మూడోవారు. శుక్రవారం 47 ఏళ్ల భారతీయుడు అయ్యాదురై కరుణానిధితోపాటూ ప్రవాస భారతీయుడైన గెరిజిం కురిభాయ్ రాజ్ దేవ్డ్ కూడా జైలుకెళ్లారు. అయ్యాదురైకి 9 వారాలు, కురిభాయ్‌కి ఏడు వారాల జైలు శిక్ష పడింది.

 ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు... రేప్ కేసులో దోషిగా తేలిన అలెక్స్ హెప్‌బర్న్

హిమాలయాల్లో యతి లేదా... ఇండియన్ ఆర్మీ ట్వీట్‌కి ఆధారాలు లేవన్న సైంటిస్టులుఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...

ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...
First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు