భారత హైకమిషన్ ఇఫ్తార్ విందులో పాక్ సెక్యూరిటీ ఓవరాక్షన్

భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్‌లను వేధించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నారు.

news18-telugu
Updated: June 1, 2019, 10:22 PM IST
భారత హైకమిషన్ ఇఫ్తార్ విందులో పాక్ సెక్యూరిటీ ఓవరాక్షన్
ఇఫ్తార్ విందు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ దేశ భద్రతా ఏజెన్సీలు ఓవర్ యాక్షన్ చేశాయి. ఇప్తార్ విందుకు వచ్చిన అతిథులతో అత్యంత అమర్యాదగా ప్రవర్తించాయి. ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా, దానికి పలువురు అతిథులు వచ్చారు. అయితే, భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్‌లను వేధించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నారు. మరికొందరు గెస్ట్‌ల కార్లను తొలగించి పక్కన పడేశారు. దీంతో కొందరు అతిథులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ పదే పదే భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>