Home /News /international /

INDIAN EXPAT WINS UAE BIG TICKET DRAW HAS NOT BE LOCATED BY OFFICIALS HSN

UAE Raffle Draw: రూ.4కోట్లు పోయినట్టే పోయి దక్కాయి.. దుబాయిలో ఓ భారతీయుడి లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల్ని అతడు దాదాపు చేజార్చుకుని, ఆ తర్వాత మళ్లీ వాటిని దక్కించుకున్నాడు. నిన్నటి వరకు అతడు సాధారణ డ్రైవర్. ఇప్పుడు అతడు లక్కీగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు ఓనర్ అయ్యాడు.

ఇంకా చదవండి ...
    దుబాయి: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుందన్నది మన తెలుగు సామెత. కానీ యూఏఈలోని ఓ భారతీయ పౌరుడిని మాత్రం అదృష్టం వెంటపడి మరీ తరిమింది. లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల్ని అతడు దాదాపు చేజార్చుకుని, ఆ తర్వాత మళ్లీ వాటిని దక్కించుకున్నాడు. నిన్నటి వరకు అతడు సాధారణ డ్రైవర్. ఇప్పుడు అతడు లక్కీగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు ఓనర్ అయ్యాడు. కొత్త సంవత్సరం తనకు అనుకోకుండా వచ్చిన గిఫ్ట్ ను పిల్లల బంగారు భవిష్యత్ కోసం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటానని అతడు చెబుతున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందనే కదా మీ అనుమానం.

    కేరళకు చెందిన ఎన్వీ అబ్దుస్సలామ్ అనే వ్యక్తి యూఏఈలోని అబుదాబీకి వెళ్లాడు. అక్కడ సొంతంగా కారు కొనుక్కుని డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో రఫ్లే బిగ్ టికెట్ డ్రా కు సంబంధించిన ఓ లాటరీ టికెట్ ను కొన్నాడు. ఆదివారం అబుదాబీలో లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు. దీంట్లో అబ్దుస్సలామ్ లక్కీ డ్రాను గెలుపొందినట్టు ప్రకటించారు. అతడికి విషయం తెలియజేద్దామని లాటరీలో ఉన్న కాంటాక్ట్ నెంబర్లను పరిశీలించారు. ఆ లాటరీలో అబ్దుస్సలామ్ రెండు ఫోన్ నెంబర్లను రాశాడు. ఈ రెండు ఫోన్ నెంబర్లకు లాటరీ నిర్వాహకులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఫోన్ నెంబర్లు అందుబాటులో లేవని తెలిసింది. దీంతో దుబాయిలోని కేరళ సంఘాలకు లాటరీ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్లు కేరళ ప్రాంతానికి చెందినవిగా తమ విచారణలో తేలిందనీ, అబ్దుస్సలామ్ అనే వ్యక్తి గురించిన సమమచారం తెలిస్తే విషయం తెలియజేయాలని కోరారు. ఈ వార్త గల్ఫ్ లోని అన్ని వార్తా చానెళ్లలోనూ, భారతీయ కార్మికుల సంఘాల్లోనూ వైరల్ అయింది. అది కాస్తా అబ్దుస్సలామ్ కు విషయం తెలిసేలా చేసింది. వెంటనే లాటరీ నిర్వాహకులను కలిశాడు. దీంతో చేజారిన అదృష్టం మళ్లీ చేజిక్కించుకున్నట్లయింది.

    ’నేను లాటరీలో గెలుచుకున్న డబ్బులో కొంత భాగాన్ని నా పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తా. మిగిలింది, ఈ కరోనా సమయంలో కుటుంబ అవసరాల కోసం జాగ్రత్తగా వాడుకుంటా. దేశం కోడ్ ను నిర్వాహకులు తప్పుగా ఎంట్రీ చేసుకోవడంతో నన్ను వాళ్లు సంప్రదించలేకపోయారు. దేవుడు నాకు అందించిన బహుమతిగా నేను భావిస్తాను.‘ అని అబ్దుస్సలామ్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా నాలుగు కోట్ల రూపాయల లాటరీ చేజారిపోయి, మళ్లీ అతడిని వెతుక్కుంటూ రావడం అదృష్టమనే చెప్పాలి.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Money, NRI News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు