అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు అక్రమించిన తర్వాత.. తొలిసారిగా తాలిబన్‌లు భారత రాయబారితో భేటీ అయ్యారు. ఖాతార్‌లోని దోహాలో భారత రాయబారి దీపక్ మిట్టల్‌తో తాలిబన్ ప్రతినిధి చర్చలు జరిపారు. తాలిబాన్ల అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్టుగా తెలిపింది. దోహాలోని భారతీయ రాయబార కార్యాలయానికి.. దోహాలోని తాలిబాన్ గ్రూప్ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్‌ని(Sher Mohammad Abbas Stanikzai) మంగళవారం వెళ్లినట్టుగా చెప్పింది. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ (Deepak Mittal)తో షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ సమావేశమయ్యారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారతదేశానికి రావాలనుకుంటున్న అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనార్టీల అంశంపైనా చర్చ జరిగినట్లు విదేశాంగా శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు గానీ, తీవ్రవాదానికి గానీ వాడుకోకుండా చూడాలని అబ్బాస్ స్టానిక్జాయ్‌కు భారత రాయబారి మిట్టల్ తెలిపారు. వీటిపై తాలిబన్ ప్రతినిధి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని తాలిబాన్ ప్రతినిధి హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వెనుతిరిగిన అమెరికా.. ముగిసిన 20 ఏళ్ల యుద్ధం..
ఇక, ఇటీవల CNN-News18 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్(Sher Mohammad Abbas Stanikzai) మాట్లాడుతూ.. తాము చుట్టుపక్కల దేశాలతో సత్సబంధాలు కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ‘ఆఫ్గానిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌కి విదేశీ పాలసీ ఉంది. మేము మా చుట్టుపక్కల దేశాలు, ప్రపంచంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అనుకుంటున్నాం. అమెరికా సంయుక్త దళాలు ఇక్కడ 20 ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు వైదొలగిపోతున్నాయి. కాబట్టి ఇకపై మేము అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగివుంటాం. అలాగే నాటోతో కూడా. అందువల్ల వారు తిరిగి వచ్చి ఆఫ్ఘనిస్థాన్‌లో(Afghanistan) పునరావాస కార్యక్రమాలు చేపడతారని భావిస్తున్నాం. అలాగే ఇండియా విషయంలోనూ. భారత్‌తో మేము సాంస్కృతికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా ఇంతకుముందులాగే స్నేహపూర్వక సంబంధాలు కలిగివుండాలి అనుకుంటున్నాం. ఇండియాతో మాత్రమే కాదు... చుట్టుపక్కల దేశాలైన తజకిస్థాన్, ఇరాన్, పాకిస్తాన్‌తోనూ అలాగే ఉండాలనుకుంటున్నాం’అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Donald Trump: ఇలాంటి దారుణ చర్యను చరిత్రలో చూడలేదు.. బైడెన్ ప్రభుత్వంపై డోనాల్డ్ ట్రంప్ విమర్శలు..
ఇక, ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. కొన్ని నెలలుగా అఫ్గాన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా (United States)తరలిస్తున్న అగ్రరాజ్యం.. సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు ప్రకటించింది. సోమవారం కాబూల్(Kabul) నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, India, Taliban