Home /News /international /

INDIAN DOCTOR OPTS TO STAY BACK IN WAR TORN UKRAINE SAYS WONT LEAVE UNTIL ALL STUDENTS EVACUATED PVN

Indian Doctor : అప్పటిదాకా ఉక్రెయిన్ లోనే ఉంటానన్న ఇండియన్ డాక్టర్

ఉక్రెయిన్ లోనే అప్పటిదాకా ఉంటానన్న భారతీయ డాక్టర్

ఉక్రెయిన్ లోనే అప్పటిదాకా ఉంటానన్న భారతీయ డాక్టర్

Indian Doctor In Ukraine : ఉక్రెయిన్ వాసులే పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడున్న విదేశీయులు కూడా తమ దేశాలకు వెళ్లిపోయేందుకు కంగారు పడుతున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ ఫ్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మనోళ్లను స్వదేశానికి తరలిస్తోంది. ఆపరేషన్ గంగా పేరుతో ప్రత్యేక విమానాలను పంపించి వారిని ఇక్కడ తీసుకొస్తుంది.

ఇంకా చదవండి ...
Russia-Ukraine War :  ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయులు ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చేద్దామని ఆలోచిస్తుంటే, ఒక భారతీయ డాక్టర్ మాత్రం అందరినీ ఇండియాకు పంపించిన తర్వాతే తిరిగొస్తానంటున్నాడు. ఉక్రెయిన్ వాసులే పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడున్న విదేశీయులు కూడా తమ దేశాలకు వెళ్లిపోయేందుకు కంగారు పడుతున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ ఫ్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మనోళ్లను స్వదేశానికి తరలిస్తోంది. ఆపరేషన్ గంగా పేరుతో ప్రత్యేక విమానాలను పంపించి వారిని ఇక్కడ తీసుకొస్తుంది.

అయితే ఇంకా చాలామంది అక్కడున్నారు. అందరిని ఇక్కడకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలం ఫిబ్రవరి 24 నుంచి క్లోజ్ అయింది. దీంతో రొమేనియా, హంగేరి, స్లోవేకియా, పోలాండ్ వంటి పొరుగు దేశాల ద్వారా ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇండియన్ డాక్టర్ మాత్రం.. ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరూ తిరిగి వెళ్లాకే, తాను ఆ దేశాన్ని వీడతానంటున్నాడు.

ALSO READ Dirty Bomb : ఉక్రెయిన్ పై రష్యా దాడికి అసలు కారణం ఇదేనట..న్యూక్లియర్ "డర్టీ బాంబ్" రెడీ చేస్తున్న ఉక్రెయిన్!

కోల్‌కతాకు చెందిన పృథ్వీరాజ్ ఘోష్ ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా, స్టూడెంట్ కన్సల్టెంట్‌ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియాకు చెందిన పౌరులను స్వదేశానికి తరలించడంలో ఆయన సహాయం చేస్తున్నారు. అక్కడ చదువుకుంటున్న భారతీయుల్లో తన స్టూడెంట్లు చాలా మంది ఉన్నారని, వాళ్లందరిని క్షేమంగా స్వదేశానికి పంపించడం తన బాధ్యత అని పృథ్వీరాజ్ ఘోష్ తెలిపారు. పృథ్వీరాజ్ ఘోష్ తన పేరెంట్స్‌తో వీడియో కాల్‌ లో మాట్లాడుతూ.."నిజానికి నేను ఇక్కడ చిక్కుకుపోలేదు. కావాలనే ఉండిపోయా. ఇక్కడ చిక్కుకున్న భారతీయులందరినీ ఇండియాకు పంపించేందుకు ప్రయత్నిస్తా. నేను ఉక్రెయిన్ నుంచి దాదాపు 350 మంది విద్యార్థులను తరలించాను. సుమీ, ఖార్కివ్‌ తోపాటు చాలా ప్రాంతాల్లో రెండు వేలకుపైగా విద్యార్థులు చిక్కుకున్నారు. వాళ్లందరికీ సాయం చేస్తా. వాళ్లకు ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు. నన్నే నమ్ముకొని ఉన్నారు. వాళ్లని వదిలి ఎలా వస్తా. అందరినీ పంపించాకే తిరిగొస్తా" అని చెప్పారు. పృథ్వీరాజ్ నిర్ణయంపై అతడి తల్లిదండ్రులు ఒకవైపు గర్వపడుతూనే, మరోవైపు ఆందోళనకు గురవుతున్నారు. తమ కొడుకుతో పాటు, ఇతర విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు