Visa for Afghans: ఆఫ్ఘన్ వాసుల కోసం భారత్‌ ఎమర్జెన్సీ వీసాలు

ఆఫ్ఘన్ వాసుల కోసం భారత్‌ ఎమర్జెన్సీ వీసాలు (image credit - twitter - ANI)

Visa for Afghans: దశాబ్దాలుగా భారత్... ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ కష్టసమయంలో కూడా వారికి ఎమర్జెన్సీ వీసాలు ఇచ్చి.. వారికి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తోంది.

  • Share this:
Visa for Afghans: ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు చేజారిపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గతంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపినవారు, ప్రభుత్వ అధికారులు, సైన్యం, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు ఆ దేశం వీడి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా భారతదేశానికి రావాలనుకునే ఆఫ్ఘన్ వాసులకు తీపికబురు చెప్పింది భారత కేంద్ర ప్రభుత్వం. భారత్ రావాలి అనుకునే వారి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కేంద్ర హోం శాఖ మంగళవారం కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది. వారి కోసం ప్రత్యేకంగా ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’ అనే కొత్త రకం ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

ఇప్పటికే ఎంతోమంది ఆఫ్ఘనీయులు భారత వీసాల కోసం వేచిచూస్తున్నారు. వారికి సాధ్యమైనంత త్వరగా వీసాలు ఇచ్చేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. "ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంశాఖ వీసా నిబంధనలను సమీక్షిస్తోంది. భారతదేశానికి రావడానికి ఫాస్ట్-ట్రాక్ వీసా దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’ అనే కొత్త రకం ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టాం" అని హోం శాఖ ప్రకటించింది.

కాబూల్ జిమ్‌లో ఆడుకుంటున్న తాలిబన్లు




ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను భారత వైమానిక దళం... ఒకట్రెండు రోజుల్లో భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 120 మందిని భారత్ తీసుకురాగా... మరో 500 మంది భారత అధికారులు, భద్రతా సిబ్బంది ఆ దేశంలో చిక్కుకుపోయారు. వారిలో చాలామంది సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. వీరందరినీ త్వరలో తిరిగి భారత్‌కు తీసుకురానున్నారు.


అమెరికా తన బలగాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకున్న తరువాత కేవలం వారం రోజుల్లోనే తాలిబన్లు ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. దీంతో తాలిబన్ల పాలనలో తమకు భద్రత ఉండదని భావించిన పౌరులు ఇతర దేశాలకు వెళ్లి తలదాచుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆఫ్ఘన్‌లో మైనారిటీలుగా ఉన్న సిక్కులు, హిందువులు భారత్‌కు రావడానికి సాయం చేస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అఫ్గాన్‌లో సిక్కు, హిందూ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారిని భారత్‌కు రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: బావిలో పడిన ఎద్దు.. కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే ఏమైందో తెలుసా?

కాబూల్ విమానాశ్రయంలో సోమవారం దారుణమైన ఘటనలు జరిగాయి. వేల మంది ఆఫ్ఘన్ వాసులు దేశాన్ని వదిలి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ దేశంలో చిక్కుకున్న సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
Published by:Krishna Kumar N
First published: