హిమాలయాల్లో యతి లేదా... ఇండియన్ ఆర్మీ ట్వీట్‌కి ఆధారాలు లేవన్న సైంటిస్టులు

Indian Army and Yeti : భారీ మనిషి ఆకారంలో యతి అనే జీవులు హిమాలయాల్లో ఉంటున్నాయనీ, అలాంటి జీవి పాద ముద్రను చూశామన్న ఇండియన్ ఆర్మీ మాటల్ని సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. అలాంటి జీవులు ఉన్నాయనేందుకు ఆధారాలు లేవంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 8:42 AM IST
హిమాలయాల్లో యతి లేదా... ఇండియన్ ఆర్మీ ట్వీట్‌కి ఆధారాలు లేవన్న సైంటిస్టులు
మమ్మీ 3 సినిమాలో ఓ దృశ్యం (Image : Twitter)
  • Share this:
హిమాలయాల్లో నివసించేదిగా చెప్పుకుంటున్న మంచు మనిషి లేదా యతి లేదా వింత జీవి లేదా హనుమంతుడు పాదముద్రల్ని తాము చూశామంటూ ఇండియన్ ఆర్మీ సోమవారం చేసిన ట్వీట్‌పై సైంటిస్టులు, నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ మిస్టీరియస్ జీవి ఉందా లేదా అన్న చర్చ కొనసాగుతుండగా... అది ఉంది అని నిరూపించే పాద ముద్రలను ఇండియన్ ఆర్మీ ట్వీట్ ద్వారా రిలీజ్ చేసింది. ఆ ఫుట్ ఫ్రింట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన పర్వతాల అధిరోహణ బృందం... పర్వతాలపై ప్రత్యేక పాద ముద్రల్ని చూసింది. అవి ఒక్కోటీ 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పూ ఉన్నాయి. ఈ లెక్కన ఆ జీవి దాదాపు 15 అడుగుల నుంచీ 20 అడుగుల ఎత్తు ఉండి ఉండాలి. ఏప్రిల్ 9న ఈ పాద ముద్రల్ని ఫొటోలు తీసినట్లు ఆర్మీ చెబుతోంది. ఇంతకు ముందు మకాలూ-బారున్ నేషనల్ పార్కులో ఈ జీవి కనిపించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అదే ప్రదేశంలో ఈ పాదముద్రలు కనిపించడం విశేషం. ఐతే... అసలు యతి అనే అనే జీవి ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు సైంటిస్టులు.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, hanuman, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్, హనుమంతుడు, హనుమాన్,
ఆర్మీ విడుదల చేసిన పాద ముద్ర ఫొటో


సైంటిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఇండియన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదనే అనుకోవాలి. అదేంటంటే... ఈ యతి అనే జంతువు నడుస్తూ వెళ్లి ఉంటే... అది రెండు కాళ్లతో నడిచినప్పుడు... రెండేసి పాదముద్రలు కనిపించాలి. కానీ ఆర్మీ ఫొటోల్లో... సింగిల్ పాదమే ఉంది. అంటే అది ఒక కాలుతోనే వెళ్లిందనుకోవాలా... అలా వెళ్లి వుంటే... అది ఓ పద్ధతైన మార్గంలో ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు సైంటిస్టులు. అందువల్ల అవి యతి పాద ముద్రలు కావని తేల్చేస్తున్నారు.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, hanuman, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్, హనుమంతుడు, హనుమాన్,
ఆర్మీ విడుదల చేసిన పాద ముద్ర ఫొటో


హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయస్వామి చాలా ఎత్తు ఉంటారనీ, ఆయనంత హైటులో... ప్రత్యేక మానవులు (యతి) హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము యతిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు చాలామంది. అంతెందుకు హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా మమ్మీ టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపెరర్‌లో చాలా యతిలను చూపించారు. హిమాలయాలతోపాటూ సైబీరియా, తూర్పు, మధ్య ఆసియాలో కూడా యతి లాంటి జీవులు ఉన్నాయని చెబుతున్నారు. యతి ఓ దైవ సమానమైన జీవి అనీ, దాదాపు తోడేలులా ఉంటుందనీ, రాయితో తయారు చేసిన భారీ ఆయుధాన్ని చేతబట్టి... విజిల్ సౌండ్ చేస్తూ వెళ్తుందని హిమాలయాల ప్రజలు నమ్ముతున్నారు.

Indian Army, yeti, foot prints, snowman, daily mail, hanuman, oryx, mysterious mythical beast, wolf, bear, hymalayas, యతి, ఎతి, ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం, పాద ముద్ర, ఫుట్ ప్రింట్, స్నో మాన్, హనుమంతుడు, హనుమాన్,
మమ్మీ 3 సినిమాలో ఓ దృశ్యం (Image : Twitter)


1954లో డైలీ మెయిల్ యతి ఉందనేందుకు కచ్చితమైన ఆధారాల్ని బయటపెట్టింది. యతికి సంబంధించినవిగా కొన్ని వెంట్రుకల్ని పరిశోధకులకు ఇచ్చింది. వాటిని పరిశోధించిన శాస్త్రవేత్తలు అవి మనిషివి కాదనీ, అలాగని ఎలుగుబంటివి కూడా కాదని తేల్చారు. అంటే అవి యతివే కావచ్చన్న అంచనా మొదలైంది.1973లో ORYX కొత్త కథనాన్ని ప్రచురించింది. యతి అనేది అసలు మంచులోనే ఉండదనీ, అక్కడ ఎంత వెతికినా దొరకదనీ, అది హిమాలయాల దగ్గరున్న అడవుల్లో తిరిగే జీవి అని రాసింది. తాజాగా ఫొటోలు రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ కావడంతో యతి ఉందన్న అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు... ఏర్పాటు దిశగా జోరందుకున్న ప్రయత్నాలు...

ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను... 10,00,00,000 మందిపై ప్రభావం...

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ
First published: May 1, 2019, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading