• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • INDIAN ARMY DECIDE TO RETURN BACK CHINESE SOLDIER WHO CAPTURED IN LADAKH CHUSHUL SECTOR HSN

Indian Army: సరిహద్దు దాటి భారత్ లోకి చైనా సైనికుడి ఎంట్రీ.. ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం

సరిహద్దులో సైనికుల పహారా

భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న మన సైనికులు గురుంగ్ కొండ సమీపంలోని తూర్పు లడఖ్ లోని చుసుల్ సెక్టార్ లో శుక్రవారం ఉదయం ఓ చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ చైనా బోర్డర్ దాటి మరీ ఆ చైనా సైనికుడు మన దేశ భూభాగంలోకి వచ్చాడు. దీంతో భారత ఆర్మీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టింది.

  • Share this:
    భారత్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఓ చైనా సైనికుడి విషయంలో ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-చైనా మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మన ఆర్మీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న మన సైనికులు గురుంగ్ కొండ సమీపంలోని తూర్పు లడఖ్ లోని చుసుల్ సెక్టార్ లో శుక్రవారం ఉదయం ఓ చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ చైనా బోర్డర్ దాటి మరీ ఆ చైనా సైనికుడు మన దేశ భూభాగంలోకి వచ్చాడు. దీంతో భారత ఆర్మీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టింది.

    కొద్ది నెలలుగా భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పిన సంగతి తెలిసిందే. దీంతో వాస్తవాధీన రేఖను దాటి మరీ భారత్ భూభాగంలోకి ఓ చైనా సైనికుడు రావడం పట్ల కలకలం చెలరేగింది. అతడు పొరపాటున భారత్ భూభాగంలోకి వచ్చాడా..? లేక చైనా సీక్రెట్ ఆపరేషన్ ఏమైనా నిర్వహిస్తోందా.? అన్న దానిపై మన సైనికులు విచారణ జరిపారు. ఆ చైనా సైనికుడిపై ప్రశ్నల వర్షం గుప్పించారు. అతడి వద్ద ఏమైనా పత్రాలు, ఆయుధాలు ఉన్నాయా..? అని పరిశీలించారు. విచారణ అనంతరం భారత్ ఆర్మీ అధికారులు కీలక నిర్ణయానికి వచ్చారు. శనివారం సాయంత్రం కానీ, ఆదివారం కానీ ఆ చైనా సైనికుడిని తిరిగి పంపించాలని నిర్ణయించారు. బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద ఆ చైనా సైనికుడిని తిరిగి పంపిస్తారు.

    ’శుక్రవారం ఉదయం ఓ చైనా సైనికుడు మన దేశసరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాము. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ కస్టడీలో అతడు ఉన్నాడు.‘ అని భారత్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. అతడిని తిరిగి వెనక్కు పంపించే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఇండియన్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పొరపాటున కనుక అతడు భారత్ భూభాగంలోకి వస్తే వదిలి పెట్టవచ్చుననీ, కాకపోతే దీని వెనుక ఏమైనా కుట్ర ఉంటే కనుక తగిన బుద్ధి చెప్పగల సత్తా మన ఆర్మీకి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతేడాది అక్టోబర్ నెలలో కూడా ఓ చైనా సైనికుడు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. విచారణ అనంతరం అతడిని మళ్లీ చైనాకు అప్పగించారు. మళ్లీ నాలుగు నెలలకే మరోసారి ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published: