సరిహద్దుల్లో కొట్టుకున్న భారత్ - చైనా బలగాలు

భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ మధ్య పోట్లాట జరిగినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 10, 2020, 4:00 PM IST
సరిహద్దుల్లో కొట్టుకున్న భారత్ - చైనా బలగాలు
ఇండో చైనా బోర్డర్
  • Share this:
భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ మధ్య పోట్లాట జరిగినట్టు తెలుస్తోంది. రెండు వైపుల వారూ తిట్టుకున్నారు. ఆ తర్వాత పిడిగుద్దులు కురిపించుకున్నట్టు తెలిసింది. ఉత్తర సిక్కింలోని సరిహద్దుల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భారత ఆర్మీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇరువర్గాలు ఘర్షణపడ్డాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. స్థానికంగా కొందరు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ‘సరిహద్దు వివాదం తేలకపోవడంతో కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకుంది. నియమిత ప్రోటోకాల్ ప్రకారం ట్రూప్స్ సమస్యను పరిష్కరిస్తాయి. ఇది చాలా కాలం తర్వాత జరిగింది.’ అని భారత ఆర్మీ వర్గాలు చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఐఏఎస్ఎన్ వార్తా సంస్థ చెప్పిన ప్రకారం నలుగురు భారత సైనికులు, ఆరుగురు చైనా సైనికులు గాయపడ్డారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 10, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading