డెమ్‌చోక్‌లో పట్టుబడ్డ చైనా సైనికుడు.. మిలటరీ పత్రాలు ఉండటంతో పలు అనుమానాలు

ప్రతీకాత్మక చిత్రం

గత కొంతకాలంగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడుతున్న పన్నాగాలపై భారత జవాన్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

  • Share this:
    గత కొంతకాలంగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడుతున్న పన్నాగాలపై భారత జవాన్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా భారత భూభాగంలో సంచరిస్తున్న చైనా సైనికుడిని భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. లడాఖ్‌లోని డెమ్‌చోక్ ఏరియాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతన్ని పలు అంశాలపై ఆర్మీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతని వద్ద సివిల్ , మిలటరీ డ్యాక్యూమెంట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అతను గూఢచర్యం చేస్తున్నాడా అనే కోణం కూడా తెరపైకి వచ్చింది.

    అయితే తన యాక్‌ను తిరిగి పొందడానికి అతను భారత భూభాగంలోకి ప్రవేశించినట్టుగా చైనా సైనికుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను ఒంటరిగానే వచ్చానని, తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని కూడా చెప్పాడు.. "ఒకవేళ అతడు అనుకోకుండా భారత భూభాగంలో ప్రవేశించినట్టయితే.. ప్రోటోకాల్ ప్రకారం తిరిగి చైనాకు అప్పగించాల్సి ఉంటుంది"అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుందని..అయితే ఆర్మీ వర్గాలు ఇప్పుడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published: