తులసి గబ్బార్డ్: అమెరికా అధ్యక్ష రేస్‌లో హిందూ మహిళ

రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఆశావహుల ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. డెమోక్రాట్ల తరఫున చాలా మంది ట్రంప్‌ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. వారిలో తులసీ గబ్బార్డ్ పేరు తాజాగా వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 13, 2018, 5:02 PM IST
తులసి గబ్బార్డ్: అమెరికా అధ్యక్ష రేస్‌లో హిందూ మహిళ
తులసి గబ్బర్డ్ (File Image: Reuters)
  • Share this:
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌కి ఇంకా రెండేళ్ల టైమ్ ఉంది. ఈలోపే, నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరన్న అంశం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా హిందూ మహిళా నేత, డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్‌ ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. తులసీ పోటీ చేయబోతున్నట్లు లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్నారై రిపబ్లికన్ నేత సంపత్‌ శివంగి ప్రకటించారు. అప్పటి నుంచే తులసీ ఎవరు? ట్రంప్‌ని ఆమె ఢీకొట్టగలరా? అమెరికా మొదటి అధ్యక్షురాలిగా ఆమె గెలుస్తారా? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐతే, అధ్యక్ష రేసులో తాను ఉన్నదీ, లేనిదీ తులసి గబ్బార్డ్ ఇంకా ప్రకటించలేదు.

37 ఏళ్ల తులసి గబ్బార్డ్, హవాయ్ నుంచీ అమెరికా కాంగ్రెస్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె ఇప్పటివరకూ నాలుగుసార్లు పోటీచేసి, గెలిచారు. అధ్యక్ష రేసులో ఆమె ఉండేదీ లేనిదీ క్రిస్మస్ నాటికి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. ఐతే, తెరవెనుక ప్లాన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోట్లాదిగా ఉన్న ఇండియన్ అమెరికన్స్, వాలంటీర్ల మద్దతుతో తులసీ... త్వరలోనే భారీ క్యాంపెయిన్ జరుపుతారని తెలుస్తోంది.

గబ్బార్డ్ పొలిటికల్ కెరీర్ చాలా క్లీన్‌గా ఉంది. ఆమె అత్యంత సమర్థురాలిగా స్థానికులు చెబుతున్నారు. పైగా, అమెరికాలో యూదు అమెరికన్ల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నది హిందువులే. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలు. ప్రతిసారీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ అమెరికన్లు తమ ప్రభావం చూపిస్తున్నారు. 2020లో ఇది గబ్బార్డ్‌కి అధ్యక్ష పీఠాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు.


గబ్బార్డ్ భారతీయురాలు కాదు. ఆమె అమెరికాలోని సమోయాలో హవాయ్ స్టేట్ సెనేటర్ మైక్ గబ్బార్డ్, కారోల్ పార్టెర్ గబ్బార్డ్‌ దంపతులకి జన్మించారు. కాకాసియన్ అయిన కారోల్, తనను తాను హిందువుగా ప్రకటించుకున్నారు. రెండేళ్ల వయసులోనే హవాయ్ వెళ్లిన గబ్బార్డ్, హిందువుగానే గుర్తింపుపొందారు. అధ్యక్ష రేసులో ఉంటున్నట్లు ప్రకటిస్తే, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తొలి హిందువు ఆమే అవుతారు. 2020లో గెలిస్తే, అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు, అతి చిన్న వయసు అధ్యక్షురాలు, హిందూ అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.

డెమొక్రాట్ల తరపున 2020 ప్రైమరీల్లో తులసితోపాటూ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, సెనెటర్లు ఎలిజబెత్ వార్రెన్, క్రిస్టెన్ గిలిబ్రాండ్, అమీ క్లోబుచర్, టిమ్ కైనే, ఇండియన్ ఆరిజన్ సెనేటర్ కమలా హార్రిస్ కూడా రేసులో ఉన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 13, 2018, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading