ఇండో అమెరికన్‌కు నోబెల్ పురస్కారం.. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి..

నోబెల్ బహుమతి పొందిన వారిలో అభిజిత్ బెనర్జీ (58) భారత సంతతి ఆర్థికవేత్త కావడం విశేషం. అభిజిత్ కలకత్తా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రాన్ని అభ్యసించారు.

news18-telugu
Updated: October 14, 2019, 4:29 PM IST
ఇండో అమెరికన్‌కు నోబెల్ పురస్కారం.. ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి..
ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్
  • Share this:
ఆర్థికశాస్త్ర విభాగంలో ఈసారి ముగ్గురు ఆర్థిక వేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. అర్ధశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు అభిజిత్ బెన‌ర్జీ, ఎస్త‌ర్ డఫ్లో, మైఖేల్ క్రీమ‌ర్‌కు సంయుక్తంగా అవార్డు ప్రకటించింది నోబెల్ కమిటీ. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురు వినూత్న ప్రయోగం చేశారని స్పష్టంచేసింది. వీరి పరిశోధనా సిద్ధాంతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేశాయని అభిప్రాయపడింది. కెన్యాలో పాఠ‌శాల ఫ‌లితాల అభివృద్ధితో పాటు భారత్ వంటి దేశాల్లోనూ ఆర్థిక సూత్రాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయని తెలిపింది. ఈ ముగ్గురు ఆర్థిక‌వేత్త‌ల ప్ర‌తిపాద‌న వ‌ల్ల సుమారు 50 ల‌క్ష‌ల మంది భార‌తీయ చిన్నారులు ల‌బ్ధి పొందిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది. నోబెల్ బహుమతి పొందిన వారిలో అభిజిత్ బెనర్జీ (58) భారత సంతతి ఆర్థికవేత్త. అంతేకాదు నోబెల్ బహుమతి సాధించిన మరో ఆర్థికవేత్త ఎస్తర్ డఫ్లో.. అభిజిత్ భార్య కావడం విశేషం., అభిజిత్ కలకత్తా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రాన్ని అభ్యసించారు. 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచీ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అభిజిత్ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.
అభిజిత్ బెనర్జీ
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>