కూలింది ఎఫ్-16 విమానమే...పాకిస్థాన్ కపట నాటకంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్...

పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్ 16 విమానాన్ని తమ సేన కూల్చి వేసిందని భారత వైమానిక దళం స్పష్టత ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ పేర్కొంది.

news18-telugu
Updated: April 6, 2019, 7:59 AM IST
కూలింది ఎఫ్-16 విమానమే...పాకిస్థాన్ కపట నాటకంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 6, 2019, 7:59 AM IST
భారత్ - పాకిస్థాన్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఇటీవల భారత వైమానిక దళం పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేయలేదని అమెరికాకు చెందిన ఫారిన్ పాలసీ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించింది. పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్ 16 విమానాన్ని తమ సేన కూల్చి వేసిందని భారత వైమానిక దళం స్పష్టత ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ పేర్కొంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఇప్పటికే ఎఫ్ - 16 ఫైటర్ విమానాల సంఖ్య, అలాగే ఇతర టెక్నికల్ విషయాల పరిశీలన కోసం అమెరికాను ఆహ్వానించిందని అమెరికన్ పత్రికలో పేర్కొంది. పాకిస్థాన్ ఎఫ్-16 విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన కొనుగోలు అగ్రిమెంట్ ఇంకా పూర్తికావాల్సి ఉంది.

అయితే ఫారిన్ పాలసీ ప్రచురించిన కథనం వాస్తవ విరుద్ధంగా ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖండించింది. ఫిబ్రవరి 27న గగనతలంలో జరిగిన ఘర్షణలో ఎఫ్-16 కూలిందని దీనికి సంబంధించిన వివరాలను తమ రాడార్లు గుర్తించినట్లు వైమానిక దళం తెలిపింది. ఎఫ్ - 16 కూల్చిన సందర్భంగానే వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ భూతలంలో దిగగా, బందీగా తీసుకెళ్లి, చివరకు వదిలిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఫారిన్ పాలసీ కథనం ప్రకారం పాకిస్థాన్ ఎఫ్ 16 విమానాలను లెక్కించుకోమని అమెరికాను ఆహ్వానించినట్లు పేర్కొంది. అయినప్పటికీ యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఎఫ్ 16 విమానాల సంఖ్యపై ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే పాకిస్థాన్ మాత్రం ఎఫ్ 16 విమానాల లెక్కింపు పూర్తయ్యిందని, భారత్ ఎఫ్ 16ను కూల్చలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించింది. ఇదే విషయం అమెరికన్ మ్యాగజైన్ పేర్కొంది. అయితే పాక్ సైన్యం మాత్రం భారత్ చేస్తున్నది అబద్ధపు ప్రచారం అంటూ కొట్టి పారేస్తోంది. అయితే అమెరికన్ డిఫెన్స్ విభాగం చెప్పే వరకూ అసలు నిజం బయటపడటం కష్టమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...