Breaking News: ఆఫ్ఘనిస్థాన్ నుంచి గుజరాత్ వచ్చిన విమానం.. భారతీయులు క్షేమం

Breaking News: ఆఫ్ఘనిస్థాన్ నుంచి గుజరాత్ వచ్చిన విమానం..(image credit - twitter - ANI)

Breaking News: ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. అందువల్ల భారత ప్రభుత్వం అక్కడి భారతీయుల్ని ఇండియాకి తరలించే పనిని వేగవంతం చేసింది.

  • Share this:
    Breaking News: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన C-17 యుద్ధ విమానం... కాసేపటి కిందట... గుజరాత్‌లోని... జామ్‌నగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో మొత్తం 120 మంది భారతీయ అధికారులు ఉన్నారు. వారిలో చాలా మంది అక్కడి భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు ఉన్నారు. వారంతా... నిన్న సాయంత్రమే కాబూల్ ఎయిర్‌పోర్టుకి వచ్చారు. అప్పటి నుంచి వారిని తరలించడం సాధ్యం కాలేదు. తాజాగా... ఇండియన్ ఎయిర్ ఫోర్స్... అమెరికా దళాలతో మాట్లాడుకొని... వారిని తరలించింది.

    ఇంకా చాలా మంది ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నారు. వారిని కూడా తరలించే పని జరుగుతోంది. జామ్‌నగర్‌లో దిగిన విమానం వీడియో క్లిప్ ఇదీ...


    మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ రాజ్యం వచ్చేయడంతో... ఇక అక్కడి నుంచి భారత రాయబారి, రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి వచ్చేయమని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి అస్సలు బాలేదు. తాలిబన్లు ఎప్పుడు ఎలాంటి అరాచకాలకు పాల్పడతారో తెలియదు. అసలు అక్కడ ప్రభుత్వమే లేదు. ఇక అలాంటి చోట... రాయబార కార్యాలయం ఉన్నా, లేకపోయినా ఒక్కటే. దానికి తోడు భారతీయ సిబ్బంది అక్కడ ఉంటే... ఏ క్షణమైనా తాలిబన్లు వాళ్లను బంధించి... లేనిపోని డిమాండ్లు పెట్టే ప్రమాదమూ ఉంది. అందుకే వీలైనంత త్వరగా వారందర్నీ అక్కడి నుంచి ఇండియా తరలించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది.

    ఇది కూడా చదవండి: Zodiac Sign: ఏ రాశి వారికి ఏ కలర్ డ్రెస్ మేలు? ఏ కలర్ వాడకూడదు?

    ఆఫ్ఘనిస్థాన్ గగనతలాన్ని అమెరికా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడంతో... అక్కడి నుంచి భారతీయుల్ని తరలించడం ఎయిర్ ఇండియాకి ఒకింత ఇబ్బందిగా ఉంది. సేఫ్‌గా తరలించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ... ప్రత్యేక ఆఫ్ఘనిస్థాన్ సెల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా... ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నవారు... ఇండియా వచ్చేందుకు అన్ని రకాల సాయమూ పొందే వీలు ఉంది. అంతేకాదు... విదేశాంగ శాఖ ఓ మొబైల్ నంబర్ కూడా ఇచ్చింది. అది +919717785379. దీంతోపాటూ... ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. అది MEAHelpdeskIndia@gmail.com ఇప్పుడు ఎవరైనా సరే... ఆప్ఘనిస్థాన్ నుంచి సాయం కోరేవారు... ఈ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా... అధికారులను సంప్రదించవచ్చు అని ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published: