• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • INDIAN AIR AMBULANCE MAKES EMERGENCY LANDING AT PAKISTAN ISLAMABAD AIRPORT SU

పాకిస్తాన్‌లో ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలు ఏం జరిగింది..?

పాకిస్తాన్‌లో ఇండియన్ ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలు ఏం జరిగింది..?

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశానికి చెందిన ఎయిర్ అంబులెన్స్ పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పాకిస్తాన్‌కు చెందిన Dunya News ఈ విషయాన్ని వెల్లడించింది.

  • Share this:
    భారతదేశానికి చెందిన ఎయిర్ అంబులెన్స్ పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పాకిస్తాన్‌కు చెందిన Dunya News ఈ విషయాన్ని వెల్లడించింది. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో భారత్‌కు చెందిన ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు పేర్కొంది. ఇందుకోసం పాకిస్తాన్ సివిల్ అవియేషన్ అధికారుల అనుమతి కూడా తీసుకుంది. పాకిస్తాన్‌ గగనవీధుల్లో ఉన్న సమయంలో ఎయిర్ అంబులెన్స్‌లో ఇంధనం తక్కువగా ఉండటంతో ఇలా చేయాల్సి వచ్చింది. ఇక, ఆ ఎయిర్ అంబులెన్స్‌లో ఓ బ్రిటిష్ పెషేంట్‌ను తరలిస్తున్నారు. ఇందుకోసం కోల్‌కతా నుంచి తజికిస్తాన్‌ రాజధాని దుషన్‌బేకు తరలించేందుకు భారత్ ఎయిర్‌ అంబులెన్స్‌ బయల్దేరింది. అందులో పెషేంట్‌తో ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు.

    అయితే ఎయిర్ అంబులెన్స్‌లో ఇంధనం తక్కువగా ఉండటంతో.. ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఇందనం నింపుకోవడానికి.. పాకిస్తాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులను సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ అంబులెన్స్‌.. ఇంధనం నింపుకుని రెండు గంటల తర్వాత కజికిస్తాన్‌కు బయల్దేరింది.
    Published by:Sumanth Kanukula
    First published: